Alerts

24, అక్టోబర్ 2023, మంగళవారం

పోస్టు గ్రాడ్యుయేట్లకు పదివేల స్కాలర్‌షిప్పులు


పోస్టు గ్రాడ్యుయేట్లకు పదివేల స్కాలర్‌షిప్పులు

యూజీ కోర్సుల్లో ప్రతిభావంతులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఏటా జాతీయ పీజీ స్కాలర్‌షిప్పులు అందిస్తోంది.



యూజీ కోర్సుల్లో ప్రతిభావంతులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఏటా జాతీయ పీజీ స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. యూజీలో సాధించిన మార్కుల మెరిట్‌తో వీటికి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం పీజీ ప్రథమ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కింద ప్రతి నెలా రూ. 15,000 చొప్పున రెండేళ్లపాటు చెల్లిస్తారు.  

దేశ అభివృద్ధిలో ఉన్నత విద్య పాత్ర చాలా కీలకం. ఈ విభాగాన్ని పటిష్ఠపరచినప్పుడే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతోన్న దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో ఉన్నత విద్య చదివేవాళ్ల సంఖ్య చాలా తక్కువ. దీన్ని అధిగమించడానికి ప్రతిభావంతులైన యువతను డిగ్రీ నుంచి పీజీ దిశగా అడుగులేయించాలి. దీనికోసం వాళ్లను ప్రోత్సహించాలి. అందులో భాగంగానే ‘నేషనల్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌’ని యూజీసీ ప్రారంభించింది. డిగ్రీ స్థాయిలో వివిధ కోర్సుల్లో మెరిట్‌ మార్కులు పొందినవారికి ఈ ప్రోత్సాహం వర్తిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌ వ్యవధి రెండేళ్లు. రెగ్యులర్‌ విధానంలో దేశంలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్నవారికి వీటిని అందిస్తారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించి, వాళ్లు పీజీలో రాణించేలా చేయడమే దీని ముఖ్య లక్ష్యం.

అర్హతలివీ...

విద్యార్థులు రెగ్యులర్‌ విధానంలో యూజీ చదివి, మెరిట్‌ మార్కులు పొంది ఉండాలి. డీమ్డ్‌ సంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, అటానమస్‌ సంస్థల్లో చదివినవారూ అర్హులే. అలాగే విద్యార్థులు ఏదైనా యూనివర్సిటీ లేదా పీజీ కాలేజీలో ప్రథమ సంవత్సరం కోర్సులో చేరి ఉండాలి. దూరవిద్య, ఆన్‌లైన్‌, పార్ట్‌ టైం కోర్సుల్లో చదివినవాళ్లు దీనికి అనర్హులు. వయసు 30 ఏళ్లకు మించరాదు. లైఫ్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌ సైన్సెస్‌, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌, కామర్స్‌, లాంగ్వేజెస్‌ వీటిలో ఏ కోర్సైనా యూజీలో చదివి మెరిట్‌ పొందినవారు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

ఎన్ని.. ఎన్నాళ్లు?

మొత్తం పదివేల స్కాలర్‌షిప్పులు ఉన్నాయి. వీటిలో 30 శాతం మహిళలకు కేటాయించారు. మిగిలినవాటిలో సగం ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, లా, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు దక్కుతాయి. మిగతా సగం సైన్స్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, మెడికల్‌, టెక్నికల్‌, అగ్రికల్చర్‌, ఫారెస్ట్రీ చదువుతున్నవారికి చెందుతాయి. వీటి వ్యవధి రెండేళ్లు. నెలకు రూ.15,000 చొప్పున ఏడాదిలో పది నెలల పాటు చెల్లిస్తారు. ప్రథమ సంవత్సరంలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మాత్రమే రెండో సంవత్సరం ప్రోత్సాహం కొనసాగిస్తారు.

నియమాలు

  • విదేశాల్లో పీజీ చదివేవారికి అవకాశం లేదు.
  • ఇతర స్కాలర్‌షిప్పులు పొందనివారే వీటికి అర్హులు. వేరే ఏవైనా పొందినట్లైతే, వాటిని వదులుకుంటేనే ఈ ఉపకార వేతనం దక్కుతుంది.
  • పీజీ ప్రథమ సంవత్సరంలో నిర్దేశిత మార్కులు సాధిస్తేనే ద్వితీయ సంవత్సరం స్కాలర్‌షిప్పు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 31.

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -

నోటిఫికేషన్స్‌ | తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌) 100 ఫ్యాకల్టీ సభ్యుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఫర్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ), హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూమ్‌లో ఒప్పంద ప్రాతిపదికన 6 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. | కర్ణాటక రాష్ట్రం కిట్టూరులోని కిట్టూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఫర్‌ గాళ్స్‌ 2024-25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి అడ్మిషన్లకు బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఆల్‌ ఇండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తోంది. |

నోటిఫికేషన్స్‌

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌) 100 ఫ్యాకల్టీ సభ్యుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాలు

తిరుపతి స్విమ్స్‌లో ఫ్యాకల్టీ

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌) 100 ఫ్యాకల్టీ సభ్యుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రొఫెసర్లు: (ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆఫ్తల్మాలజీ, సైకియాట్రీ): 4

అసోసియేట్‌ ప్రొఫెసర్లు : 20

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు : 76

అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఎండీ లేదా ఎంఎస్‌ లేదా డీఎన్‌బీ చేసి ఉండాలి. నిర్ణీత అనుభవం  కూడా ఉండాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2023

వెబ్‌సైట్‌: https://svimstpt.ap.nic.in/


హైదరాబాద్‌ ఎంఎస్‌ ఎంఈ టూల్‌ రూమ్‌లో..

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఫర్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ), హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూమ్‌లో ఒప్పంద ప్రాతిపదికన 6 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌ ఇంజినీర్‌- 02

డిజిటల్‌ మార్కెంటింగ్‌ ఆఫిసర్‌ - 01

టూల్‌ డిజైన్‌ ట్రైనర్‌ - 02

వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) ట్రైనర్‌ - 01

ఇంటర్య్వూ తేదీ: 28-10-2023

వెబ్‌సైట్‌: https://www.citdindia.org/


ప్రవేశాలు

కిట్టూరు రాణి చెన్నమ్మ సైనిక్‌ స్కూల్లో..

కర్ణాటక రాష్ట్రం కిట్టూరులోని కిట్టూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఫర్‌ గాళ్స్‌ 2024-25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి అడ్మిషన్లకు బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఆల్‌ ఇండియా ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తోంది.

అర్హతలు: అయిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. జూన్‌ 1, 2012 నుంచి మే 31, 2014 మధ్యలో (రెండు తేదీలను కలిపి) జన్మించి ఉండాలి.

అడ్మిషన్‌ విధానం: జాతీయ స్థాయిలో రాత పరీక్ష ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. అందులో అర్హత పొందినవారికి ఇంటర్య్వూ, ఫిజికల్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్టులుంటాయి.

పరీక్ష తేదీ: 28 జనవరి, 2024. పెన్ను, పేపర్‌ (ఆఫ్‌ లైన్‌) పద్ధతిలో పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్‌, కన్నడ భాషల్లో నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు: కిట్టూరు, విజయపుర్‌, బెంగళూరు, కలబుర్గి (కర్ణాటక)

పరీక్ష ఫీజు: సాధారణ అభ్యర్థులకు రూ. 2000. ఎస్సీ ఎస్టీలకు (కర్ణాటకలో నివసిస్తున్న వారికి మాత్రమే) రూ. 1600 .

దరఖాస్తు: ఆన్‌లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ: 30, అక్టోబరు 2023న ప్రారంభమవుతుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 15 డిసెంబరు, 2023.

వెబ్‌సైట్‌: www.kittursainikschool.org

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -

తాజా ఇంటర్న్‌షిప్‌లు Work From Home

తాజా ఇంటర్న్‌షిప్‌లు

మార్కెటింగ్‌ అండ్‌ మార్కెట్‌ అనలిటిక్స్‌

విశాఖపట్నంలో

మార్కెటింగ్‌ అండ్‌ మార్కెట్‌ అనలిటిక్స్‌

సంస్థ: గోప్రయాణ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 25

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/4aae06


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: డిజిటల్‌ వర్డ్‌ ఆఫ్‌ మౌత్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 27

అర్హతలు: కాపీ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఎస్‌ఈఓ, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/739513


ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ సర్టిఫికేషన్‌

సంస్థ: గ్రాబ్‌టెక్‌ ఇన్‌ఫోమేటిక్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 27

అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటం, హిందీ, తెలుగు మాట్లాడటంలో నైపుణ్యం

internshala.com/i/bffcf3


విజయవాడలో

యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: ఫిట్‌పియో టెక్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 27

అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఫిగ్మా, ప్రొటోటైపింగ్‌, వైర్‌ఫ్రేమింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/81447c


గుంటూరు, విజయవాడల్లో  

కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌

సంస్థ: వ్యాహృతి ఐటీ సొల్యూషన్స్‌ అండ్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 25

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, యూఐ నైపుణ్యాలు

internshala.com/i/719477

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -

21, అక్టోబర్ 2023, శనివారం

Assam Rifles: అస్సాం రైఫిల్స్‌లో 161 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు | అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2/ ఇంటర్‌, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

Assam Rifles: అస్సాం రైఫిల్స్‌లో 161 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు 

షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం… గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి డిసెంబర్‌ నెలలో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తోంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు నవంబర్‌ 19 లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ-2023 (గ్రూప్ బి, సి): 161 పోస్టులు 

ట్రేడులు:

1. బ్రిడ్జి అండ్‌ రోడ్‌ (మేల్‌, ఫిమేల్‌)

2. రెలీజియస్‌ టీచర్‌ (మేల్‌)

3. లైన్‌మ్యాన్ ఫీల్డ్ (మేల్‌)

4. రికవరీ వెహికల్ మెకానిక్ (మేల్‌)

5. బ్రిడ్జ్‌ అండ్‌ రోడ్డు (మేల్‌, ఫిమేల్‌)

6. ఎలక్ట్రికల్ అండ్‌ మెకానికల్ (మేల్‌, ఫిమేల్‌)

7. డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మేల్‌, ఫిమేల్‌)

8. ప్లంబర్ (మేల్)

9. సర్వేయర్ ఐటీఐ (మేల్‌)

10. ఎక్స్-రే అసిస్టెంట్ (మేల్‌)

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2/ ఇంటర్‌, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: గ్రూప్-బికి రూ.200; గ్రూప్-సికి రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). 

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 21-10-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-11-2023.

ర్యాలీ ప్రారంభం: 18-12-2023 నుంచి.

Notification Information

Posted Date: 20-10-2023

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -

AAICLAS: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో 436 అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులు | అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషతో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.

AAICLAS: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో 436 అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులు 

న్యూదిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్‌ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్… దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్‌ కేంద్రాల్లో మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు…

* అసిస్టెంట్ (సెక్యూరిటీ): 436 పోస్టులు

అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషతో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.10.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

పోస్టింగ్ స్థలం: చెన్నై, కోల్‌కతా, గోవా, కోజికోడ్, వారణాసి, శ్రీనగర్, వడోదర, తిరుపతి, వైజాగ్, మధురై, తిరుచ్చి, రాయ్‌పూర్,

రాంచీ, భువనేశ్వర్, పోర్ట్ బ్లెయిర్, అగర్తల, గ్వాలియర్, అమృత్‌సర్, లేహ్, దేహ్రాదూన్, పుణె, ఇందౌర్, సూరత్.

జీత భత్యాలు: నెలకు రూ.21,500 నుంచి రూ.22,500.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు రూ.100.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20.10.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.11.2023.

Notification Information

Posted Date: 20-10-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -

NIMHANS: నిమ్‌హాన్స్‌లో 161 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు | అర్హత: బీఎస్సీ నర్సింగ్ | బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్… రెగ్యులర్‌ ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

NIMHANS: నిమ్‌హాన్స్‌లో 161 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 

బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్… రెగ్యులర్‌ ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

* నర్సింగ్ ఆఫీసర్: 161 పోస్టులు

అర్హత: బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.  

వయోపరిమితి: 35 సంవత్సరాలు మించకూడదు. 

పే స్కేల్: నెలకు రూ.9300-రూ.34800.

ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.1,180 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.885).

ఆన్‌లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 18.11.2023.

Notification Information

Posted Date: 20-10-2023

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -



- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -

Recent

Local jobs from various areas no need to pay money for these jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...