Alerts

--------

4, నవంబర్ 2023, శనివారం

🌺 నేడు "మానవ గణన యంత్రం" శకుంతలా దేవి జయంతి 🌺 ‘‘గణితం లేకుండా మీరేమీ చేయలేరు. మీ చుట్టూ ఉన్నదంతా అంకెలు, సంఖ్యలు, గణితమే.’’ - శకుంతలా దేవి

🌺 నేడు "మానవ గణన యంత్రం" శకుంతలా దేవి జయంతి 🌺
‘‘గణితం లేకుండా మీరేమీ చేయలేరు. మీ చుట్టూ ఉన్నదంతా అంకెలు, సంఖ్యలు, గణితమే.’’
 - శకుంతలా దేవి
గణితమే తన లోకంగా జీవించిన మేధావి శకుంతలాదేవి. గణితంతో మూడేళ్ల వయసులో మొదలైన ఆమె ప్రయాణాన్ని, మరణం మాత్రమే విడదీయగలిగింది. 
శకుంతలాదేవి 1929 నవంబర్ 4న బెంగళూరులోని ఒక సనాతన కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పూజారిగా ఉండటానికి ఇష్టపడక సర్కస్ కంపెనీలో చేరారు. వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. అలాంటి పరిస్థితులు కూడా శకుంతలాదేవి ప్రతిభకు అడ్డుకట్ట వేయలేకపోయాయి.
 
 ఆమె మూడేళ్ల చిన్నారిగా ఉన్నప్పుడు తండ్రితో పేకాడుతూ ప్రతి ఆటలోనూ గెలిచేది. అంత చిన్నపాప ప్రతీసారీ తనపై గెలవడం తండ్రికి ఆశ్చర్యం కలిగించింది. తన కూతురు మోసం చేస్తుందేమోనని అనుమానం కలిగించింది. అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఆడినా ఆమెదే విజయం. చివరకు.. పేక ముక్కలన్నింటినీ గుర్తుపెట్టుకోవడం వల్లనే శకుంతల గెలుస్తోందని గుర్తించాడు. ఆమె అద్భుత జ్ఞాపకశక్తిని తమకు జీవికగా ఉపయో గించుకున్నాడు.
 
 ఆమెతో ప్రదర్శనలిప్పిం చాడు. అలా అలా ఆమె ప్రతిభ విశ్వ విద్యాలయాలకు చేరింది. ఆరేళ్ల వయసులో తొలిసారి యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌లో ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకు అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆ తర్వాత ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో బాల మేధావిగా ఆమె పేరు మారుమోగింది.

 శకుంతలాదేవికి లెక్కలంటే ఏమాత్రం లెక్కలేదు. ఎంత పెద్ద సమస్యనైనా ఆమె చిటికలో పరిష్కరించేవారు.

 తన ప్రతిభను ప్రదర్శించేందుకు ఆమె 1944లో తండ్రి చేయి పట్టుకుని లండన్ చేరుకున్నారు.
 
 అనేక విశ్వవిద్యాలయాల్లో, వివిధ సంస్థల్లో ప్రదర్శనలిచ్చారు. 1950 అక్టోబర్ 5న బీబీసీలో తన గణిత ప్రతిభను ప్రదర్శిం చారు. లెస్లీ మిషెల్ ఇచ్చిన సమస్యను సెకన్లలో పరిష్కరించారు. ఆ సమాధానం తప్పని మిషెల్ అన్నారు. కానీ శకుంతలా దేవి తాను సరైన సమాధానమే చెప్పానని, సరిచూసుకోమని దృఢంగా చెప్పారు. ఆవిడ తిరిగి చూసుకుంటే శకుంతలా దేవి సమాధానమే సరైనదని తేలింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఆమెకు ‘హ్యూమన్ కంప్యూటర్’ అనే బిరుదు దక్కింది. 

శకుంతలా దేవి ప్రతిభకు డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో జరిగిన సంఘటన మరింత అద్దం పడుతుంది. అమెరికాలోని ఈ యూనివర్సిటీవారు శకుంతలా దేవిని ఆహ్వానించారు. ఆమె ప్రతిభను పరీక్షించే పనిలో భాగంగా 201 అంకెలున్న సంఖ్యకు 23వ రూట్ చెప్పమన్నారు.
 
  ఆవిడ 50 సెకన్లలో చెప్పేసింది. కానీ అది నిజమో కాదో తెలుసుకోవడానికి అమెరికన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ సంస్థలోని యూనివాక్-1101 అడ్వాన్స్‌డ్ కంప్యూటర్‌లో ప్రత్యేక ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చింది. 

1980లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఆమె గిన్నిస్ రికార్డు సృష్టించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బెర్క్‌లీ) సైకాలజీ ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సన్ 1988లో శకుంతలాదేవి ఇంటెలిజెన్స్‌ను అధ్యయనం చేశారు. అనేక క్లిష్ట సమస్యలను జెన్సన్ పేపర్‌పై రాసేకంటే అతి తక్కువ సమయంలో ఆమె పరిష్కరించి అతన్ని ఆశ్చర్యపరిచారు.

1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తోశకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ ను ఓడించేశారు. 

ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు

76,86,36,97,74,870  అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. 

ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది.

యూనివర్సిటీ ఆఫ్ 
కాలిఫోర్నియాకు  చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు.

గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.

1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.

శకుంతలా దేవి కేవలం గణిత మేధావి మాత్రమే కాదు. మంచి రచయిత కూడా. స్వలింగ సంపర్కంపై భారత దేశంలో తొలి సమగ్ర రచన అయిన ‘ద వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువాలిటీ (1977)’ శకుంతలా దేవి రాసిందే. దీనితో పాటు గణితం, జ్యోతిషంపై అనేక పుస్తకాలు రాశారు. ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ లాంటి పుస్తకాలు రాశారు

యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పైన్స్ 1969లో శకుంతలాదేవికి ‘మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇచ్చింది. వాషింగ్టన్ డీసీ 1988లో రామానుజన్ మేథమెటికల్ జీనియస్ అవార్డును ప్రదానం చేసింది.
 
 శకుంతలా దేవి 1980లో మెదక్ నుంచి ఇందిరా గాంధీపై పోటీ చేశారు. 

1980లో బెంగళూరుకు చేరి పిల్లల కోసం అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఒక మాంచి స్ఫూర్తి నింపు కథ ఒక మాంచి స్ఫూర్తి నింపు కథ

ఒక మాంచి స్ఫూర్తి నింపు కథ

దట్టమైన అడవిలో… చిక్కని చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు…

1943… డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే… హుబ్లీలో ఉంటాడు… తను వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్‌లో పోస్టింగ్ వచ్చింది. అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్. ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి.
జూలై… తుఫాను రాత్రి… ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు… హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు. ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు. ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు వ్యక్తులు మరాఠీలో చెప్పారు. ‘‘త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతో నడువ్…’’
ఆయన నిశ్శబ్దంగా తన మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో కలిశాడు… గంటన్నర తరువాత ఎడ్లబండి ఆగింది. దట్టమైన చీకటి, గడ్డితో పైకప్పు వేయబడిన ఓ చిన్న ఇల్లు అది. లోపలకెళ్తే సన్నగా లాంతరు వెలుతు, మంచంపై ఓ మహిళ, పక్కన ఓ ముసలామె.
అయోమయంగా చూశాడు డాక్టర్.
ఆమె ఎవరు..? నన్నెందుకు తీసుకొచ్చారు..? వైద్యం కోసమేనా..? అదే నిజమైతే అక్కడే చెప్పొచ్చు కదా… ఈ నిర్బంధ ధోరణి దేనికి..? మర్యాదగా అడిగినా వచ్చేవాడు కదా… 
‘ప్రసవం చేయాలి డాక్టర్’ అన్నాడు ఓ వ్యక్తి… 
ఆమె నొప్పితో గిలగిలలాడుతోంది… ఏం చేయాలో డాక్టర్‌కు బోధపడటం లేదు… తనలోని డాక్టర్ స్థిమితంగా లేడు… ఎందుకంటే..? తను అంతకుముందు ఎప్పుడూ డెలివరీ చేయలేదు… కానీ ఆమెకు ఎలాగైనా సాయపడాలని అనుకున్నాడు… డాక్టర్ కదా… ఊరుకోలేకపోయాడు…
నొప్పి డైవర్ట్ చేయడానికి మాటల్లో దింపాడు… ఆమెను అడిగాడు… ‘అసలు ఎవరు నువ్వు..? ఇక్కడికి ఎలా వచ్చావు..?’
‘డాక్టర్ సార్, నాకు బతకాలని లేదు… నేనొక భూస్వామి కూతురిని’ ఆమె గొంతులో ధ్వనిస్తున్న బాధ… ‘‘మా ఊళ్లో హైస్కూల్ కూడా లేదు… అందుకని నన్ను చదువు కోసం కాస్త దూరంగా ఉన్న పట్టణానికి పంపించారు… అక్కడ ఓ క్లాస్‌మేట్‌ను ప్రేమించాను… ఈ కడుపు ఆ ప్రేమ వల్లే… కడుపు విషయం తెలియగానే ఆ అబ్బాయి జంప్… నా తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు… కానీ అప్పటికే ఆలస్యమైంది… ఇంకేమీ చేయడానికి లేదు, అందుకని ఇక్కడ ఉంచారు… ఇటువైపు ఎవరూ రారు… నా కడుపు, నా బాధ ఎవరికీ తెలియదు, తెలియవద్దనే ఈ ఏర్పాటు…’’ అంటూ రోదించసాగింది…
డాక్టర్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు… మెల్లిమెల్లిగా తన సాయంతో ఆమె ఓ ఆడబిడ్డను ప్రసవించింది… కానీ ఆ బిడ్డ ఏడవడం లేదు… పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఆమె మళ్లీ ఏడుపు అందుకుంది… డాక్టర్ సార్, దాన్ని ఇక్కడే చంపేయండి… నా బతుకులాగే దానిది కూడా ఏడుపు బతుకు కావొద్దు ప్లీజ్…’
కులకర్ణి ఎలాగోలా తంటాలు పడ్డాడు కాసేపు… పిల్ల ఏడ్చింది… ఆ గదిని వదిలిపెట్టి బయటికి వచ్చాక ఆయనకు 100 రూపాయలు ఇవ్వబడ్డాయి… అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే… తన జీతమే 75 రూపాయలు… ఫీజు తీసుకున్నాడు, లెక్కపెట్టుకునేటప్పుడు తన మెడికల్ బ్యాగ్ గదిలోనే మరిచిపోయినట్టు గుర్తొచ్చింది… ఆ బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి, గదిలోకి వెళ్లాడు… ఆ వంద రూపాయలు ఆ కొత్త తల్లి చేతుల్లో పెట్టాడు…
‘‘సంతోషమో, దుఖమో.. మన చేతుల్లో ఏమీ లేవు… జరిగిందేదో జరిగిపోయింది… అన్నీ మరిచిపో… నీ జీవితం నీది… ప్లాన్ చేసుకో… ప్రయాణానికి తగినంత ఓపిక వచ్చాక పూణె వెళ్లు, అక్కడ నర్సింగ్ కాలేజీ ఉంటుంది… అందులో నా దోస్త్ ఆప్టే ఉంటాడు… వెళ్లి కలువు, కులకర్ణి పంపించాడని చెప్పు… తను తప్పక సాయం చేస్తాడు… ఇది ఓ సోదరుడి సూచన అనుకో, సాయం అనుకో, ఇప్పుడైతే నేన్నీకు వేరే సాయం ఏమీ చేయలేను’’ అని ఆమె తలపై ఓదార్పుగా ఓసారి చేయి వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు…
ఏళ్లు గడిచాయి… కులకర్ణి ఇప్పుడు పలు రంగాల్లో నైపుణ్యం సంపాదించాడు… ఓసారి అనుకోకుండా ఓ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఔరంగాబాద్ వెళ్లాడు… అక్కడ డాక్టర్ చంద్ర అనే లేడీ డాక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి బాగా అబ్బురపడ్డాడు… ప్రోగ్రాంలో అనుకోకుండా తన పేరు కులకర్ణిగా ప్రస్తావనకు వచ్చేసరికి డాక్టర్ చంద్ర చకచకా నేరుగా తన దగ్గరకు వెళ్లింది… ‘సర్, మీరు ఎప్పుడైనా చందగఢ్ వెళ్లారా..?’ అనడిగింది…
‘అవును, చాలా ఏళ్ల క్రితం.,. నాకు ఆ ఊరితో బంధముంది… అక్కడ కొన్నాళ్లు పనిచేశాను’
‘అయితే మీరు ఓసారి మా ఇంటికి వస్తారా ప్లీజ్…’
‘డాక్టర్ చంద్రా, మిమ్మల్ని తొలిసారి కలిశాను, మీ ప్రజెంటేషన్ సింప్లీ సూపర్బ్… నాకు బాగా నచ్చింది… కానీ ప్రస్తుతం మీ ఇంటికి రాలేను… మళ్లీ ఎప్పుడైనా తప్పకుండా మీ ఇంటికి వస్తాను, ఏమీ అనుకోవద్దు ప్లీజ్…’
‘సర్, దయచేసి ఒక్కసారి రండి, కాసేపు… మీ టైం ఎక్కువగా తీసుకోను, మీరొక్కసారి మా ఇంటికి వస్తే జీవితాంతం మిమ్మల్ని మరిచిపోను’.. కులకర్ణి ఇక మాట్లాడలేకపోయాడు… ఆమె అంత ఇదిగా పిలుస్తుంటే ఎలా కాదనగలడు? పైగా ఆమె పరిజ్ఞానం తనను ముగ్దుడిని చేసింది… ఆమె వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది… లోపలకు అడుగు పెట్టకముందే… ‘అమ్మా, మనింటికి ఎవరొచ్చారో ఓసారి చూడు…’ అని గట్టిగా పిలిచింది.
డాక్టర్ చంద్ర తల్లి బయటికి వచ్చింది… కులకర్ణిని చూడగానే కాసేపు తన కళ్లను తనే నమ్మలేకపోయింది… జలజలా కన్నీళ్లు కారిపోతున్నాయి అసంకల్పితంగా… ఆయన పాదాలపై పడింది… ఆమె కన్నీళ్లు కులకర్ణి పాదాలను తడిపేస్తున్నయ్… ఆయన గందరగోళంలో పడిపోయాడు… తరువాత ఆమె చెప్పింది…
‘ఆ రాత్రిపూట మీరు చందగఢ్ అడవిలో నాకు డెలివరీ చేశారు… ఆరోజు పుట్టింది ఈ బిడ్డే… మీరు చెప్పినట్టే పూణె వెళ్లాను, మీ మిత్రుడి సాయంతో చదువుకున్నాను… స్టాఫ్ నర్స్ అయ్యాను… నా బిడ్డను ఓ మంచి గైనకలాజిస్టును చేయాలనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను… మీరే స్పూర్తి… ఆశీర్వదించండి సార్…’ అంది చేతులు జోడిస్తూ…
ఆనందం, ఆశ్చర్యం ఆయన్ని కమ్మేశాయి… తన తొలి డెలివరీ కేసు ఆమె… అదీ ఓ గడ్డు స్థితిలో… డాక్టర్ చంద్రను అడిగాడు… ‘ఇంతకీ నన్నెలా గుర్తించావు..?’
అనుకోకుండా మీ పేరు కులకర్ణి అని వినిపించేసరికి ఆశ్చర్యపోయాను… అమ్మ మీ పేరును రోజూ ఓ మంత్రంలా పఠిస్తూనే ఉంటుంది… 
సార్, మీ పూర్తి పేరు రామచంద్ర కులకర్ణి అని మీ మిత్రుడు చెప్పాడు… అందులో నుంచే నా బిడ్డకు చంద్ర అని పేరు పెట్టుకున్నాను… ఆమెకు జీవితం ప్రసాదించింది మీరే… మీరే ఆదర్శంగా పేద మహిళలకు ఫ్రీ డెలివరీ, ఫ్రీ వైద్యం నా బిడ్డ అలవాటు చేసుకుంది… ఎన్నో కేసులు, ఎందరికో ప్రాణం పోసింది… సార్, ఈమె స్పూర్తి రీత్యా మీ బిడ్డే…’ ఆమె చెబుతూనే ఉంది…
ఇప్పుడు ఆయన కళ్లల్లో ఎందుకో నీళ్లు… ఆగడం లేదు… జారుతున్న తడిని తుడుచుకోవాలని కూడా లేదు… కొన్నిసార్లు కన్నీళ్లు అలా మత్తడి దూకాల్సిందే… 

చెప్పనేలేదు కదూ… ఈ డాక్టర్ కులకర్ణి ఎవరో తెలుసా..? ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తికి స్వయానా తండ్రి.
ఆహా...ఎంత గొప్ప మనసులు...
ఇటువంటి చరిత్రను నేటి తరం పిల్లలకు పాఠ్యాంశాలుగా బోధిస్తేనే మన భావితరం ఆదర్శంగా జీవిస్తారనటంలో అతిశయోక్తి లేదేమో.!!

☘️ఇది కథ కాదు.! జరిగిన కథ.! స్ఫూర్తిని గుండెల నిండా నింపే కథ.!హృదయలోతుల్లోంచి ఆర్ధ్రత పొంగుకు వచ్చే కథ.! నేను చదువుతుంటే నా కళ్క్ష వెంట ఆనందబాష్పాలు రాల్చిన కథ.! ఇది మన కథ.!!
జయశ్రీరామ*ధర్మపథం
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో నాన్ టీచింగ్ పోస్టులు | అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కింది ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  

ఉద్యోగాల వారీగా ఖాళీల వివరాలు:

1. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- 01

2. టెక్నికల్ సూపరింటెండెంట్- 04

3. సెక్షన్ ఆఫీసర్- 02

4. జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ (మేల్‌)- 01

5. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్- 02

6. ఫిజియోథెరపిస్ట్ (మేల్‌)- 01

7. స్టాఫ్ నర్స్- 06

8. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్- 01

9. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 01

10. జూనియర్ ఇంజినీర్ (సివిల్)- 01

11. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 01

12. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- 10

13. అకౌంటెంట్- 09

14. జూనియర్ అసిస్టెంట్- 17

15. జూనియర్ టెక్నీషియన్- 29

16. జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 02

17. జూనియర్ హార్టికల్చరిస్ట్- 01

మొత్తం పోస్టుల సంఖ్య: 89.

అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ: 12.11.2023.


Important Links

Posted Date: 03-11-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

3, నవంబర్ 2023, శుక్రవారం

CBSE: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) జనవరి-2024 | పరీక్ష విధానం: | అర్హతలు: | దరఖాస్తు రుసుము: | తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: | ముఖ్యమైన తేదీలు:

ఉపాధ్యాయవృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్​ఈ) నిర్వహిస్తోంది. సీటెట్​ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా జనవరి-2024 ఏడాదికి సంబంధించిన సీటెట్​ నోటిఫికేషన్​ విడుదలైంది. 18వ ఎడిషన్‌ సీటెట్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నవంబర్‌ 3 నుంచి నవంబర్‌ 23 వరకు కొనసాగనుంది. పరీక్షను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు. 

వివరాలు...

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్‌) జనవరి-202

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. 

అర్హతలు:

పేపర్-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా(డీఈఎల్‌ఈడీ)/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(బీఈడీ)/ బీఈడీ(ప్రత్యేక విద్య) లేదా సీనియర్‌ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్‌ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200(పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600(పేపర్ 1 & 2 రెండూ).

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03-11-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 23-11-2023.ఫీజు చెల్లింపు చివరి తేది: 23-11-2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 21-01-2024.


Important Links

Posted Date: 03-11-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

JEE Main: జేఈఈ మెయిన్‌ సిలబస్‌ తగ్గింపు! * దరఖాస్తుల ప్రక్రియ షురూ * నవంబర్‌ 30 వరకు తుది గడువు * జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు * ఎన్‌టీఏ నోటిఫికేషన్‌ జారీ

JEE Main: జేఈఈ మెయిన్‌ సిలబస్‌ తగ్గింపు!  

* దరఖాస్తుల ప్రక్రియ షురూ

* నవంబర్‌ 30 వరకు తుది గడువు

* జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు

* ఎన్‌టీఏ నోటిఫికేషన్‌ జారీ

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ తొలి విడతకు దరఖాస్తుల ప్రక్రియ గురువారం మొదలైంది. విద్యార్థులు నవంబర్‌ 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) గురువారం(నవంబర్‌ 2) నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌లో చేరేందుకు జేఈఈ మెయిన్‌లో పేపర్‌-1, బీఆర్క్‌లో ప్రవేశానికి పేపర్‌-2ఏ, బీ-ప్లానింగ్‌లో ప్రవేశానికి పేపర్‌-2బీ రాయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పేపర్‌-1లో 300 మార్కులు(90 ప్రశ్నలు), పేపర్‌-2ఏలో 400 మార్కులు(82 ప్రశ్నలు), పేపర్‌-2బీలో 400 మార్కులు(105 ప్రశ్నలు) ఉంటాయి. ఫిబ్రవరి 12న స్కోర్‌ వెల్లడిస్తారు. ఈ పరీక్షల్లో కనీస స్కోర్‌ సాధించిన రెండున్నర లక్షల మందికి(అన్ని సామాజికవర్గాల వారిని కలిపి) మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత ఉంటుంది. అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైనవారికి మాత్రమే ఐఐటీల్లో చేరేందుకు అవకాశం ఇస్తారు. తుది విడత జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. రెండుసార్లు రాస్తే.. ఆ రెండింటిలో ఎక్కువ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ను దాదాపు 11 లక్షల మంది రాస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఏ నగరం/పట్టణంలో పరీక్ష కేంద్రం కేటాయించారో జనవరి రెండో వారంలో వెల్లడిస్తారు. పరీక్షకు మూడు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు(హాల్‌టికెట్‌) వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు.

సిలబస్‌ తగ్గింపు

కరోనా కాలంలో సీబీఎస్‌ఈ విద్యార్థులకు 9, 10 తరగతులతోపాటు ఇంటర్‌ లేదా తత్సమాన తరగతిలో సిలబస్‌ తగ్గించినందువల్ల ఆ ప్రకారం జేఈఈ మెయిన్‌ పరీక్షలకు కూడా తగ్గించారు. రసాయనశాస్త్రంలో పలు పాఠ్యాంశాలను పూర్తిగా తొలగించారు. భౌతికశాస్త్రం, గణితంలో కొన్ని పాఠ్యాంశాలను పూర్తిగా, మరికొన్నింట్లో పాక్షికంగా తొలగించారు. తొలగించిన పాఠ్యాంశాల వివరాలను జేఈఈ మెయిన్‌ వెబ్‌సైట్లో ఎన్‌టీఏ అందుబాటులో ఉంచిందని, వాటిని పరిశీలించి పరీక్షలకు సిద్ధం కావాలని శిక్షణ నిపుణులు ఉమాశంకర్, కృష్ణచైతన్య తెలిపారు. తెలంగాణ ఇంటర్‌ బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులు మాత్రం వాటిని చదవక తప్పదని పేర్కొన్నారు.

       జేఈఈ (మెయిన్) నోటిఫికేషన్‌ వివరాల కోసం క్లిక్‌ చేయండి

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

2, నవంబర్ 2023, గురువారం

అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు సువర్ణ అవకాశం కలదు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారికి అనంతపురం నగరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు పొందవచ్చు.

అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు సువర్ణ అవకాశం కలదు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారికి అనంతపురం నగరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు పొందవచ్చు. వివిధ కంపెనీలలో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలోనే జాబ్ మేళాను నిర్వహించనున్నారు.

నవంబర్ 03, 2023 ఉదయం 9 గంటలకు APSSDC డిస్టిక్ ఆఫీస్ అనంతపురం నందు జాబ్ మేళా నిర్వహిస్తారు. ఇందులో ప్రముఖ సంస్థలు మొబైల్స్ మరియు టీం లెస్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సంవత్సరంలో క్యాషియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు సేల్స్ అసోసియేట్స్ మరియు డి మార్ట్, స్విగ్గి, విభాగాలలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటి కోసం పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఆపై చదువు వారికి అర్హతగా నిర్ణయించారు.

వీటిలో ఉద్యోగం పొందిన నిరుద్యోగులకు అనంతపురం హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. మరియు అర్హత సాధించిన వారికి 12 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయల వరకు నెల జీతం అందిస్తారు.పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పిస్తారు. ఈ కంపెనీలలో నూట పది ఉద్యోగాల వరకు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం నిరుద్యోగ మహిళలు పురుషులు పాల్గొనవచ్చు. వీటిలో పాల్గొనే వారి వయసును 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలని అర్హతగా నిర్ణయించారు. మరింత సమాచారం కోసం APSSDCవెబ్సైట్ను సంప్రదించవచ్చు.

NFL: ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 74 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

NFL: ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 74 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 

నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీల వివరాలు:

1. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 60 పోస్టులు

2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్‌&ఎ): 10 పోస్టులు

3. మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా): 04 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 74.

అర్హత: పోస్టును అనుసరించి ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీఎం, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ, ఎల్‌ఎల్‌బీ, బీఎల్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.40000 - రూ.140000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01/12/2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 03, 04/12/2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు

‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 02-11-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Recent

Navodaya Intermediate Entrance Halltickets: The admit cards for class XI LEST 2026 have been released. The admit cards for the State of West Bengal and Jharkhand will be released later. The date of selection test for admission to class XI for the session 2026-27 for the state of Jharkhand and West Bengal has been rescheduled and the LEST class XI for these States will held on 15.03.2026

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...