పత్రికా ప్రకటన | తిరుమల | 3 అక్టోబర్ 2021 తిరుపతి లోని చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి లో స్వచ్ఛంద సేవకై సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు ఆహ్వానం.
తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహించనున్న శ్రీ పద్మావతి పిల్లల హృదయాలయం ( శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ ) ఆసుపత్రి లో స్వచ్ఛంద సేవలు అందించడానికి భారతదేశంలోని గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సీనియర్ పీడియాట్రిక్ కార్డియో థోరాసిక్ సర్జన్లు, డాక్టర్లును ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. టీటీడీ ప్రాణదానం పథకం కింద నిర్వహించనున్న ఈ ఆసుపత్రిలో నవజాత శిశువుల మరియు పిల్లలకు గుండె చికిత్సలు, వైద్య సేవలు అందించడం కోసం కనీసం 15 సంవత్సరాల అనుభవం కలిగిన హిందూ మతానికి చెందిన డాక్టర్లు వారి ఆసక్తిని తెలియజేయాలని కోరింది. ఈ స్వచ్ఛంద సేవలను ఆప్షన్ A మరియు ఆప్షన్ B అనే రెండు విధానాలలో చేయవచ్చును. ఆప్షన్ A విధానం లో స్వచ్ఛంద సేవ కోసం వచ్చే డాక్టర్ తో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులకు ఉచిత వసతి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రోటోకాల్ దర్శనం, తిరుమల - తిరుపతి మధ్య ఉచిత రవాణా సదుపాయం కల్పించడం జరుగుతుంది. ఆప్షన్ B కింద.స్వచ్ఛంద సేవ కై ఆసక్తి కనపరిచే వైద్య నిపుణులకు టీటీడీ ని...