Agnipath Recruitment Scheme | కేంద్ర సాయుధ బలగాల్లో నాలుగేళ్ల పాటు పనిచేసే అవకాశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్‌ను (Agnipath Scheme) ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా అగ్నివీర్లను (Agniveer) నియమించుకోనుంది. కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రకటించింది. అగ్నిపథ్ స్కీమ్‌ను (Agnipath Scheme) మంగళవారం ఆవిష్కరించింది. ఇది కేంద్ర సాయుధ బలగాల కోసం చేపడుతున్న రిక్రూట్‌మెంట్ స్కీమ్. డిఫెన్స్ బడ్జెట్ తగ్గించుకొని మరిన్ని ఆయుధాలు సమకూర్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ఇండియన్ ఆర్మీ (Indian Army), ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బలగాలకు చెందిన అధినేతలు ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీగా అగ్నివీర్‌లను (Agniveer) నియమించుకోనుంది. రాబోయే 90 రోజుల్లోనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి బ్యాచ్ 2023 జూలై నాటికి సిద్ధం అవుతుంది. ఎంపికైనవారిని అగ్నివీర్‌గా పిలుస్తారు. ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ సెంట్రలైజ్డ్ సిస్టమ్...