UPSC Exams: యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు ప్రోత్సాహకం * అర్హత సాధిస్తే రూ.లక్షన్నర ఆర్థికసాయం * రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు
UPSC Exams: యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థులకు ప్రోత్సాహకం  									 										 											 												 																										 * అర్హత సాధిస్తే రూ.లక్షన్నర ఆర్థికసాయం   * రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు     		  ఈనాడు, అమరావతి: యూపీఎస్సీ  ప్రిలిమ్స్, మెయిన్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆర్థికసాయం అందించేందుకు  ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్  (ఐబీ) సిలబస్ అమలు, ఉద్యోగాల భర్తీ వంటి నిర్ణయాలు, అసెంబ్లీలో  ప్రవేశపెట్టనున్న పలు బిల్లులను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. సీఎం జగన్  అధ్యక్షతన సచివాలయంలో బుధవారం(సెప్టెంబర్ 19) మంత్రివర్గ సమావేశం  జరిగింది. ఇందులో విద్యార్థులు, ఉద్యోగార్థులకు సంబంధించి ముఖ్యాంశాలు..    యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రోత్సాహకం   యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  (యూపీఎస్సీ) నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన  సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు జగనన్న సివిల్  సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో ఆర్థికసాయం అందించేందుకు నిర్ణయం.  ప్రిలిమినరీలో అర్హత సాధిస్తే రూ.లక్ష, మెయిన్స్‌లో అర్హత పొంది...