హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ వార్తలు 28-05-2020
హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు రంజాన్ పండుగను పురస్కరించుకుని కరోనా నియంత్రణ లో తమ వంతు బాధ్యతగా కృషి చేస్తున్నటువంటి 31 వార్డు వాలంటీర్లకు నిత్యవసర వస్తువులు కూరగాయలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సతీష్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ 31 వ వార్డు నాయకురాలు ఇందిరమ్మ ఆధ్వర్యంలో జరిగింది.
లాక్ డౌన్ నేపధ్యంలో అన్ని వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కథలు, కవితలు పోటీలు నిర్వహిస్తున్నట్లు బిజెపి నాయకులు తెలిపారు. కథ అయితే మూడు పేజీలకు మించకుండా, కవిత అయితే 25 లైన్లకు మించకుండా 9848348759 లేదా 9390512345 నెంబర్లకు వాట్సాప్ ద్వారా పంపవచ్చని, కథ, కవితలకు వేరువేరుగా ప్రథమ బహుమతిగా 20 వేలు, ద్వితీయ బహుమతిగా 10 వేలు, తృతీయ బహుమతిగా 5 మందికి నాలుగు వేల చొప్పున అందజేయడం జరుగుతుందని అన్నారు. వీటిని ఈ నెల 30 నుండి జూన్ 7 లోపు పంపాల్సి ఉంటుంది. విజేతలను జూన్ 15 తెలుపుతామన్నారు.
ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు జూన్ రెండవ వారంలో విడుదయలయ్యే అవకాశం ఉంది అయితే ఈ ఏడాది మాత్రం ముందుగా సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయాలని భావిస్తోంది.
నేడు వై ఎస్ ఆర్ వాహన మిత్రకు గడువు పూర్తి కానుంది. ఈ పథకం ద్వారా యజమానే డ్రైవరుగా ఉన్న ఆటోలకు, టక్సీ క్యాబులకు ప్రతి ఏటా 10 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు తమ దరఖాస్తులను గ్రామ / వార్డు వాలంటీర్లకు అందజేయాలి. దరఖాస్తు ఫారాలకు జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్డు నందు సంప్రదించవచ్చు.
ఇంటర్ తరువాత టీచర్ ఉద్యోగం చేయాలనుకునే వారికోసం ఎపి డిఇఇ సెట్ అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి. ఆన్ లైన్ లో దరఖాస్తు కు చివరి తేది జూన్ 5, పరీక్ష తేది జూన్ 23. లాక్ డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉండి అప్లికేషన్ చేయించుకోవాలనుకునే వారు జెమిని ఇంటర్ నెట్ వారికి 9640006015 కు ఫోన్ చేసి ఆన్ లైన్ సేవలను పొందవచ్చు.
ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన టైలరింగ్, డ్రాయింగ్, వీవింగ్ కోర్సు టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు (టిసిసి) 2020 ఫలితాలను విడుదల చేసినట్లు డి ఇ ఓ శామ్యూల్ బుధవారం ప్రకటనలో తెలిపారు.
కోల్ కత్తా ప్రధాన కేంద్రంగా ఉన్న
ఈస్టర్న్ రైల్వేని చెందిన హౌరా డివిజన్ లోని ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఒప్పంద
ప్రాతిపదికన 50 పోస్టుల భర్తీ
మెడికల్ ప్రాక్టీషనర్లు 10
నర్సింగ్ సూపరింటెండెంట్ స్టాఫ్ నర్స్ 40
అర్హత
పోస్టును అనుసరించి జి ఎన్ ఎం / బి ఎస్సీ/ ఎం ఎస్సీ నర్సింగ్, ఎంబిబిఎస్ /
ఎండి ఉత్తీర్ణత, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరిగే ఈ ఉద్యోగాలకు ఇ మెయిల్
ద్వారా దరఖాస్తుకు చివరి తేది మే 31 fightcorona.howrah@gmail.com
కామెంట్‌లు