GEMINI TIMES | హిందూపురం పట్టణ | విద్య | ఉద్యోగ సమాచారం 27-05-2020

హిందూపురంలో కొత్త ప్రాంతాలకు కరోనా విస్తరిస్తోంది. కాంటాక్ట్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి నిత్యావసర వస్తువులు పంపిణీ లో పాల్గొన్నవారికి కరోనా పాజిటివ్ తేలడం కొన్ని కేసుల్లో సరైన లింకులు  దొరకక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ తరివాత కూడా హిందూపురానికి ప్రత్యేక జనతా కర్ఫ్యూ  అవసరం  పడవచ్చు. ఈ తరుణంలో ఎస్పీ సత్య యేసు బాబు లాక్ డౌన్ ను కఠినంగా అమలు జరిగేలా చూడాలని పోలీసులు అధికారులను ఆదేశించారు. కాగా ముక్కడిపేటలో పోలీసులు బారికేడ్లు బిగించడానికి వెళ్ళగా రెండు నెలలుగా కట్టిపడేశారు ఇంకెన్నాళ్ళు ఇలా అని జనం వారి పై తిరగబడగా పోలీసులు బ్యారికేడ్లు వేయకుండానే వెనుదిరిగారు.

ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ప్రకారం 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజుల కోసం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, జూనియర్ కళాశాలలు తమ వివరాలను ఈ నెల 27 నుంచి జూన్ 9 వ తేదీలోపల www.apsermc.ap.gov.in  వెబ్ సైట్లో పొందుపరచాలని అలా కాని  పక్షంలో ఫీజు వసూలుకు అనుమతించమని ఛైర్మెన్ జస్టిస్ ఆర్ కాంతారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏ విద్యాసంస్థ అయినా ఫీజులు పెంచినట్లు తెలిస్తే తల్లిదండ్రులు లేదా ఇతర వ్యక్తులు ఇదే వెబ్ సైట్లో ఉంచిన గ్రీవెన్స్ కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. కాగా దేశంలో పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యాసంస్థలు తెరిచేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే నోటిఫికేషన్ ద్వారా 9700 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రెండు  రోజుల్లో విడుదలయ్యే అవకాశం  ఉంది.

తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీటం బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి దరఖాస్తు గడువు పెంపు
ఖాళీలు 16
బోధనేతర సిబ్బంది 8
బోధనా సిబ్బంది 8
ఉద్యోగాల వివరాలు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జానినేషన్ 1, సిస్టం అనలిస్ట్ 1, ప్రైవేట్ సెక్రటరీ 1, నర్సింగ్ ఆఫీసర్ 1, ప్రిజర్వేషన్ అసిస్టెంట్ 1, ఎల్ డి సి 1, లైబ్రరీ అంటెండెంట్స్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 4, ప్రొఫెసర్ 1, అసోసియేషన్ ప్రొఫెసర్లు 3.
దరఖాస్తుకు ఆఖరు తేది మే 31
వెబ్ సైట్ http://rsvidyapeetha.ac.in

కోవిడ్ 19 కారణంగా ఆదాయం చెదిరి సొంత ఊళ్ళకు చేరుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఆదుకోవడానికి బాలీవుడ్ నటుడు సోనూ సూద్, ప్రత్యేకంగా వారి కోసం  స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారంతో కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. 18001213711 నెంబరుకు వలస కార్మికులు ఫోన్ చేస్తే వారి స్వస్థలాలకు చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.

ఇకనుంచి వాట్సాప్ ద్వారా కూడా భారత్ గ్యాస్ వినియోగదారులు వంటగ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు. దేశంలో రెండో అతి పెద్ద సంస్థగా ఉన్న భారత్  పెట్రోలియం కార్పొరేషన్ వాట్సాప్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. కస్టమర్లు గ్యాస్ సిలిండర్ కోసం కంపెనీ వద్ద నమోదు చేసుకున్న మొబైల్ నెంబరు నుంచి 1800224344 అనే నెంబరుకు వాట్సాప్ చేయవచ్చు.

ఇండియ‌న్ ఆర్మీలో సోల్జ‌ర్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
సోల్జ‌ర్ పోస్టులు: 06
అర్హ‌త‌: ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త‌
వ‌య‌సు: 23 ఏళ్లు మించ‌కూడ‌దు
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2020
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌
https://joinindianarmy.nic.in/writereaddata/Portal/BRAVO_NotificationPDF/Kargil_Rally_26_Jun_to_30_Jun_20.pdf

నార్త‌ర‌న్ రైల్వే రిఫ్రాక్ష‌నిస్ట్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
రిఫ్రాక్ష‌నిస్ట్ పోస్టులు
అర్హ‌త‌:బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 10, 2020
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌
https://nr.indianrailways.gov.in/nr/recruitment/1589263147648_Refractionist.pdf

అంధ్రప్రదేశ్ సెట్ ల పరీక్షా తేదీల వివరాలు

పరీక్ష
తేదీ
ఈసెట్
జూలై 24
ఐసెట్
జూలై 25
ఎంసెట్
జూలై 27 - 31 వరకు
పీజీసెట్
ఆగస్టు 2 - 4 వరకు
ఎడ్‌సెట్
ఆగస్టు 5
లాసెట్
ఆగస్టు 6
పీఈసెట్
ఆగస్టు 7- 9 వరకు (ఫీల్డ్ టెస్టు మాత్రమే)


దేశవ్యాప్తంగా జులై 18 నుంచి జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. తాజాగా ఉదయం పరీక్ష 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్ష 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. పరీక్ష జరిగే తేదీకి 15 రోజుల ముందు హాల్‌టికెట్లను వెబ్‌సైట్లో ఉంచుతామని ఎన్‌టీఏ తెలిపింది. పరీక్షా కేంద్రం ఎక్కడన్నది కూడా అప్పుడే తెలుస్తుంది. ఈ అప్లికేషన్లలో ఫోటో లేదా వివరాలలో తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి సంబంధించిన లింక్ అందుబాటులో ఉంది. https://jeemain.nta.nic.in/webinfo/public/home.aspx

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.