హిందూపుర పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 17-05-2020
హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరులలో వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న 17 మందిని వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా అస్సాం రాష్ట్ర కార్మికులను శనివారం రాత్రి స్థానిక హిందూపురం తహశిల్దార్ కార్యాలయం నుండి ప్రత్యేక బస్సులో విజయవాడకు పంపారు.
అత్యవసర వైద్య సేవల కోసం హిందూపురంలోని కంటైన్మెంట్ జోన్ల నుంచి ఆటోల్లో ఆస్పత్రులకు వెళ్ళడానికి అవకాశం కల్పించామని సబ్ కలెక్టరు నిశాంతి తెలిపారు అయితే అత్యవసర వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వెళ్ళడానికి నిర్ణయించిన ఆటోలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిపారు, కంటైన్మెంట్ జోన్లలో ఫీవర్ క్లినిక్ లు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ ప్రజలకు వైద్య సేవలు అందుతాయని అత్యవసర వైద్య సేవల కోసం స్థానికంగా ఉన్న నవాజ్ నర్సింగ్ హోం, తేజా నర్సింగ్, మనోజ్ క్లినిక్, బాలాజి క్లినిక్, శిల్పక్లినిక్, హ్యాపి షైన్, గిరిష్ డెంటల్, శ్రీనివాస నర్సింగ్, శిల్ప నర్సింగ్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందొచ్చన్నారు.
హిందూపురానికి చెందిన కరోనా సోకిన 17, మరియు 35 ఏళ్ళ మహిళలకు ప్రస్తుత పరీక్షల్లో నెగిటివ్ రావడంతో బత్తలపల్లి ఆర్ డి టీ ఆసుపత్రిలో నుండి శనివారం డిశ్చార్జ్ చేశారు. వారి 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని కలెక్టరు గంధం చంద్రుడు పేర్కొన్నారు.
డి ఎస్సీ 2008 అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే వివరాలను అందజేయాలని డి ఇ ఓ సామ్యూల్ తెలిపారు. మెరిట్ లిస్ట్ ల పై సందేహాల నివృత్తి కోసం సూపరింటెండెంట్ రంగస్వామి 9247719855 సీనియర్ అసిస్టెంట్ ఇక్బాల్ బాషా 9133356786 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.
సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలు ఎపి రెసిడెన్షియల్ కాలేజ్ నాగార్జున సాగర్ లో ప్రవేశం
ఎంచుకున్న గ్రూపును బట్టి వ్రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం
అర్హతః 2020 లో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ బోర్డు నుంచి మొదటి ప్రయత్నంలోనే ఇంటర్మీడియేట్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. గతంలో ఉత్తీర్ణులయిన వారు అనర్హులు. ప్రత్యేకించి ఇంగ్లీషులో 40 శాతం మార్కులు ఉండాలి ఎస్సీ ఎస్టీ బిసీలకు 5 శాతం సడలింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది మే 30
అనంతపురం దగ్గరలోని ప్రసన్నయపల్లి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అంధ్రప్రదేశ్ లో ప్రవేశాలు
అందించే కోర్సులు బి ఎ హానర్స్ లో ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, ఎం ఏ ఇంగ్లీషు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, బి వొకేషనల్ టూరిజం అండ ట్రావెల్ మేనేజ్ మేంట్, బి వొకేషనల్ రిటైల్ మేనేజ్ మెంట్ అండ్ ఐటీ
ప్రవేశ పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
దరఖాస్తుకు చివరి తేది మే 23
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు
మొత్తం ఖాళీలు 150
దరఖాస్తుకు చివరి తేది మే 27
టి హెచ్ డి సీ ఇండియా లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ
ట్రెయినీ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు 10
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పబ్లిక్ రిలేషన్స్ 4
దరఖస్తుకు చేవరి తేది జూన్ 15
కామెంట్‌లు