DSC 2018 కోటాలో 27మందికి ఉద్యోగాలు | డీఎస్సీ-2008’ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్‌జీటీ ఉద్యోగాలు | టెన్త్‌ మోడల్‌ పేపర్లు రెడీ | జూన్‌ 3న ఇంటర్‌ ‘వాయిదా’ పరీక్షలు | ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల

🔳డీఎస్సీ-2018 క్రీడా కోటాలో 27మందికి ఉద్యోగాలు

డీఎస్సీ-2018 క్రీడా కోటా కింద ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించిన క్రీడా ప్రాధికార సంస్థ 27 మందిని ఎంపిక చేసింది. వీరికి జిల్లా విద్యాధికారులు నియామక పత్రాలు అందజేస్తారు.

‘🔳డీఎస్సీ-2008’ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్‌జీటీ ఉద్యోగాలు May 16 2020 @ 03:47AM
4,657 మందికి ఊరట

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2008లో కామన్‌ మెరిట్‌ లిస్టులో ఉండి..  సెలెక్షన్‌ పద్ధతి మారడంతో గత 12 ఏళ్లుగా ఉద్యోగం పొందలేకపోయిన 4,657 మంది అభ్యర్థులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆయా అభ్యర్థులు అంగీకరించినట్టయితే.. వీరికి కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ) ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆయా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ఈ నెల 18లోగా అంగీకారం తీసుకుని మెయిల్‌ చేయాలని డీఈవోలను ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

🔳టెన్త్‌ మోడల్‌ పేపర్లు రెడీ May 16 2020 @ 04:59AM
100 మార్కులను విభజిస్తూ పేపర్ల వారీగా బ్లూప్రింట్‌ విడుదల చేసిన పరీక్షల విభాగం

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల విధానం మారిన నేపథ్యంలో.. ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రభుత్వ పరీక్షల విభాగం బ్లూప్రింట్‌ విడుదల చేసింది. గతంలో 11 పేపర్లు ఉండగా.. ప్రస్తుతం పేపర్ల సంఖ్యను 6కు కుదించారు. ఈ నేపథ్యంలో..

ఇంగ్లీషు పేపర్‌ ఇలా.. : ప్రశ్నపత్రాన్ని 3 సెక్షన్లుగా విభజించారు. సెక్షన్‌-ఏలో రీడింగ్‌, కాంప్రహెన్షన్‌పై 30 మార్కులకు 15 ప్రశ్నలు, సెక్షన్‌-బీలో గ్రామర్‌, వొకాబులరీపై 40 మార్కులకు 17 ప్రశ్నలు, సెక్షన్‌-సీలో క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌పై 30 మార్కులకు 3 ప్రశ్నలు ఉంటాయి.

జనరల్‌ సైన్స్‌ : ఫిజికల్‌ సైన్స్‌లో 46 మార్కులకు 16 ప్రశ్నలు, బయలాజికల్‌ సైన్స్‌లో 54 మార్కులకు 17 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 4 సెక్షన్లలో కలిపి 33 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్‌-1లో 12, సెక్షన్‌-2లో 16, సెక్షన్‌-3లో 32, సెక్షన్‌-4లో 40 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.

సోషల్‌ స్టడీస్‌: సెక్షన్‌-1లో ఆబ్జెక్టివ్‌ టైపులో 12 మార్కులకు 12  ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌-2లో 8 ప్రశ్నలకు రెండేసి మార్కుల చొప్పున ఉంటాయి. సెక్షన్‌-3లో 8  ప్రశ్నలకు 4 మార్కులు చొప్పున కేటాయించారు. సెక్షన్‌-4లో 5 ప్రశ్నలకు 8 మార్కుల చొప్పున ఉంటాయి.

మ్యాథ్స్‌ పేపర్‌: మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-1లో 12 మార్కులకు 12 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1కు 6, పేపర్‌-2కు 6 మార్కులు ఉంటాయి. సెక్షన్‌-2లో  రెండేసి మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్‌-3లో 4 మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్‌-4లో 8 మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు.

🔳జూన్‌ 3న ఇంటర్‌ ‘వాయిదా’ పరీక్షలు May 16 2020 @ 04:31AM

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. జూన్‌ 3న మోడ్రన్‌ లాంగ్వేజ్‌-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం 9  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించింది.

🔳ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల May 16 2020 @ 04:32AM

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): 2018-19 బ్యాచ్‌కి చెందిన కన్వీనర్‌ కోటా అభ్యర్థులకు, ఒకసారి ఫెయిలైన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరి 20 నుంచి 24 వరకూ నిర్వహించిన లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ (ఎల్‌పీటీ) పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు, కాలేజీల సౌకర్యార్థం మార్కుల మెమోలను www.bseap.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.