14, మే 2020, గురువారం

ఐఐటీ కౌన్సెలింగ్‌ రౌండ్ల తగ్గింపు!!



హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే జేఈఈ-మెయిన్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు వాయిదా పడటంతో తరగతుల ప్రారంభం కూడా ఆలస్యమవడం అనివార్యంగా మారింది. దీంతో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్‌ ప్రక్రియలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఐఐటీ, నీట్‌లలో ప్రవేశాలకుగానూ జేఈఈ కౌన్సెలింగ్‌కు ఈ ఏడాది తక్కువ రౌండ్లు నిర్వహించాలని యోచిస్తోంది. 2019లో సీట్ల భర్తీకి జోసా 7 రౌండ్ల కౌన్సెలింగ్‌ నిర్వహించింది. ఈసారి రౌండ్లు తగ్గించాలని ఐఐటీలు మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపాయి. దీంతో ఈ ఏడాది ఐదు లేదా ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. జేఈఈ-మెయిన్‌ పరీక్షను జూలై 18 నుంచి 23 వరకు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఆగస్టు 23న నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే

కామెంట్‌లు లేవు: