🔳ఎస్పీఎంవీవీ పీజీ సెట్ దరఖాస్తు గడువు పెంపు
తిరుపతి (మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ ప్రవేశాలకు ఏటా నిర్వహించే.. ఎస్పీఎంవీవీ-2020 పీజీసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును జూన్ 10 వరకు పొడిగించినట్లు వీసీ ఆచార్య జమున తెలిపారు. కొవిడ్-19 కారణంగా జులై లేదా ఆగస్టులో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
జులై 30 నుంచి ఎస్‌ఆర్‌ఎం జేఈఈఈ ప్రవేశ పరీక్షలు
ఎస్‌ఆర్‌ఎం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంజినీరింగ్(ఎస్‌ఆర్‌ఎం జేఈఈఈ) ప్రవేశపరీక్షలు జులై 30 నుంచి ఆగస్టు 4 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఆగస్టు 2 లేదా 3వ వారం నుంచి ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
ఆగస్టు 3 నుంచి ‘సత్యభామ’లో ప్రవేశ పరీక్షలు
‘సత్యభామ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ వర్సిటీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు ఆగస్టు 3 నుంచి 5 వరకు జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగస్టు 8న ఫలితాలు, 12న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి