20, మే 2020, బుధవారం


లాక్ డౌన్ ప్రభావంతో హిందూపురం నుండి వెనక్కు వెళ్ళిపోయిన వలస కార్మికులు తిరిగి రాకపోతే ఇక్కడ ఉన్న ప్రజలకు ఎన్నో ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఇక్కడ ఒకటే అని కాదు దేశంలోని ప్రతి ప్రాంతంలోని పరిస్థితి ఇదే. పారిశ్రామిక వాడల్లో ఖాళీ అయిన ఖాళీలు, పట్టణంలోని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు అలాగే వ్యాపారుల వద్ద పని చేసే వారి స్థానాన్ని ఏ మాత్రం భర్తీ చేస్తారో హిందూపురం వాసులు చూద్దాం. అన్నీ బాగానే ఉన్నా కష్టించి పని చేసే తత్వం హిందూపురం యువతకు ఉంటే ఈ అవకాశాలన్నీవారికే అన్నది నిజం. ఉద్యోగాలనీ, ప్రభుత్వాలను ఆడిపోసుకునే వారు ఉన్నంతకాలం నిరుద్యోలుగా ఉండిపోతారు అదే ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ కాళ్ళ పై నిలబడి సమాజానికి బరువు కాకుండా ఉండటమన్నది అసలైన పౌరుని లక్షణం. లాక్ డౌన్ తరువాత కొత్త ఉద్యోగాలు కొత్త ఉపాధి అవకాశాలు కష్టమే కాక పోతే, జీవితానికి ఉద్యోగమే పరమావధి కాదు.

కామెంట్‌లు లేవు: