Alerts

--------

27, మే 2020, బుధవారం

JEE MAINS EXAM DETAILS

జూలై 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న జేఈఈ మెరుున్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు జూలై మొదటి వారంలో హాల్‌టికెట్లను జారీ చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు చేస్తోంది.

ఏప్రిల్‌లో జరగాల్సిన ఈ పరీక్షలను కరోనా నేపథ్యంలో జూలైకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పరీక్ష తేదీలను ఇదివరకే ప్రకటించిన ఎన్‌టీఏ తాజాగా దానిపై అధికారిక నోటీసు జారీ చేసింది.
పరీక్షలు నిర్వహించే నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండో షిప్ట్ పరీక్ష ఉంటుందని పేర్కొంది. విద్యార్థుల పరీక్ష కేంద్రాల వివరాలతో కూడిన హాల్‌టికెట్లను పరీక్ష ప్రారంభానికి 15 రోజుల ముందుగా జారీ చేస్తామని వెల్లడించింది. జూలై 26వ తేదీన నిర్వహించనున్న నీట్ హాల్‌టికెట్లను కూడా 15 రోజుల ముందుగా వెబ్‌సైట్ అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
మాక్ టెస్టులకోసం యాప్జేఈఈ, నీట్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఆన్‌లైన్ పరీక్షలను ప్రాక్టీస్ చేసుకునేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) మాక్ టెస్టులను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేషనల్ టెస్ట్ అభ్యాస్ పేరుతో మొబైల్ యాప్‌ను అందుబాటులో ఉంచింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో https://www.nta.ac.in/Abhyas కూడా విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకోవచ్చని వివరించింది.

కామెంట్‌లు లేవు:

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...