అనంతపురము, జూన్ 26
: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి కార్యాలయంలో ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్ట్ ను కాంట్రాక్టు పద్ధతిలో ఒక సంవత్సరం పాటు నియామకం చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ చైర్ పర్సన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, అనంతపురము వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుకు ఎంపిక అయిన వారికి నెలకు రూ.15,000/- లు చొప్పున వేతనం ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. విద్యార్హతలకు సంబంధించి డిగ్రీ మరియు ఇంగ్లీషులో టైప్ రైటింగ్ హయ్యర్ పాస్ అయి ఉండాలని తెలిపారు. అదేవిధంగా కంప్యూటర్ ను ఆపరేట్ చేయగలిగే పరిజ్ఞానం ఉండాలన్నారు. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు వుండాలని, 10.07.2020 నాటికి 34 ఏళ్ళలోపు దాటకూడదని, నియమ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, వికలాంగులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ లకు 10 సంవత్సరాల మినహాయింపు వుంటుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ బయోడేటా ను మరియు విద్యార్హతల కు సంబంధించిన ధ్రువపత్రాల తో జూలై 10వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు అనంతపురం జిల్లా న్యాయసేవాధికార సంస్థ వారి కార్యాలయం నకు అందజేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పై ప్రకటనలో తెలిపారు.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురం వారిచే జారీ
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, అనంతపురం వారిచే జారీ
కామెంట్‌లు