20, జూన్ 2020, శనివారం

AP Vaidya Vidhana Parishad 723 Jobs Recruitment 2020 | AP వైద్యవిధాన పరిషత్ నుండి ఉద్యోగాల భర్తీ

ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి వివిధ విభాగాలలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న జోన్ బట్టి తమ సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ19 జూన్ 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ18 జులై 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 723 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

DAS:

APVVP-26
డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్-5
CAS-692

అర్హతలు:

DAS:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి BDS పూర్తి చేసి ఉండాలి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి

CAS:

ఈ కేటగిరిలోని పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి సంబంధిత విభాగంలో PG డిగ్రీ లేదా డిప్లొమా లేదా DNB చేసి ఉండాలి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి.

వయసు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి

జీతం:

53,500 జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు  క్రింద ఇవ్వబడిన ఆఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

అర్హతలను బట్టి 65 నుండి 75 శాతం మార్కులను కలిగి ఉండి కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ గా కనీసం 6 పని చేసిన అనుభవం కలిగి ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది

చెల్లించవలసిన ఫీజు:

OC మరియు BC అభ్యర్థులు  1500 రూపాయలు మరియు SC/ST అభ్యర్థులు  1000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Website

Notification

Apply Now

కామెంట్‌లు లేవు: