14, సెప్టెంబర్ 2020, సోమవారం

OPD

మోడీ గవర్నమెంట్  "మీ ఇంట్లోనే OPD గా "
ఉండండి (అంటే హాస్పిటల్ కి పోనవసరం లేకుండా ఇంట్లోనే ఉండి డాక్టర్ సేవలు పొందడం) . 

కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం మరియు ఇతర పౌరులందరికీ ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది ~
పథకం పేరు * eSANJEEVANI. *

ముఖ్యంగా రక్తపోటు, డయాబెటిస్ మొదలైన జబ్బులు గల వృద్ధులు రెగ్యులర్ మెడిసిన్ తీసుకునే వారు ఒపిడి కోసం వెంటనే ఈ సమయంలో ఆసుపత్రికి వెళ్లలేరు.

వెళదాము అన్నా ప్రమాదం ఎక్కువ. తలనొప్పి, శరీర నొప్పి వంటి చిన్న సమస్యలకు, వారు ఆసుపత్రికి వెళ్లడానికి వారు ఇష్టపడక ఇంట్లో ఉండవచ్చు.

ఇప్పుడు, వారికోసం  eSANJEEVANI వెబ్‌సైట్ ఉంది, ఇది సులభమైంది.  దీన్ని Google Chrome ద్వారా చేరుకోవచ్చు. ఆ వెబ్ సైట్ లో ఈ క్రింది విధంగా చెయ్యాలి.

1. రోగుల నమోదును ఎంచుకోండి.
2. మీ మొబైల్ నెం. మరియు వెబ్‌సైట్‌ లోకి వెళ్లడానికి OTP ను పొందండి.
3. రోగి వివరాలు మరియు జిల్లా నమోదు చేయండి.

ఇప్పుడు, మీరు ఆన్‌లైన్‌లో వైద్యుడికి కనెక్ట్ అవుతారు.
అప్పుడు, వీడియో ద్వారా, మీ ఆరోగ్య సమస్యల కోసం మీరు వైద్యుడిని సంప్రదించవచ్చు.

డాక్టర్ ఆన్‌లైన్‌లో మందులు సూచిస్తారు.
మీరు దానిని మెడికల్ షాపులో చూపించి  మందులు పొందవచ్చు.

* ఇది పూర్తిగా ఉచితం. క్వాక్ డాక్టర్లు బెడద ఉండదు.*

 * ఆదివారంతో సహా ప్రతిరోజూ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఈ సేవను ఉపయోగించవచ్చు. . *

అప్పుడే ఈ-కాన్సుల్టేషన్ కి తమిళనాడులోని తిరుపూర్‌కు మొదటి స్థానం లభించింది.

మీకు తెలిసిన మీ సీనియర్ సిటిజన్లకు దయచేసి దీన్ని ఫార్వార్డ్ చేయండి.

* ఈ కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్
 https: //www.eSanjeevaniopd.in*

కామెంట్‌లు లేవు:

Recent

IBPS Clerk Admit Cards Released for 10,277 Posts