15, నవంబర్ 2020, ఆదివారం

విడుదలైన ఐబీపీఎస్ -2020 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ పరీక్షల ఫలితాలు :

 


ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ టెస్ట్ ( IBPS ) నుంచి పలు పరీక్ష ఫలితాలు తాజాగా విడుదల అయ్యాయి.

దేశంలో ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్ -1 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ఆన్ లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించగా, తాజాగా నేడు ఈ పరీక్ష ఫలితాలను ఐబీపీఎస్ ప్రకటించింది.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్ -1 పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలతో పాటు,

ఈ రెండు పరీక్షలకు సంబంధించిన ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్లను కూడా తమ అధికారిక వెబ్సైటు లో అందుబాటులో ఉంచినట్లు ఐబీపీఎస్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ద్వారా ఈ ఐబీపీఎస్ -2020 పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు.

Result Link

కామెంట్‌లు లేవు: