15, నవంబర్ 2020, ఆదివారం

రైల్వే ఉద్యోగాల కోసం NRTI నూతన కోర్సులు :

 

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. భారతీయ రైల్వే లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు భారతీయ రైల్వే కు చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోరేషన్ ఇన్స్టిట్యూట్ (NRTI) ఒక ముఖ్యమైన ప్రకటన చేసినది.


రైల్వే లో ఉద్యోగాలు మరియు వసతుల కల్పన కోసం అభ్యర్థులకు అవసరమైన శిక్షణను అందించేందుకు పలు నూతన కోర్సులను తాజాగా NRTI ప్రవేశపెట్టినది.

2020-21 విద్యా సంవత్సరం నుంచి రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అందరికి  ఈ నూతన కోర్సులు అందుబాటులో ఉండనున్నట్లు NRTI ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అందించబోయే ఈ నూతన కోర్స్ లలో రెండు (2)బీ. టెక్ యూజీ ప్రోగ్రామ్స్, రెండు (2)ఎంబీఏ కోర్సులు, మూడు (3)ఎమ్మెస్సీ ప్రోగ్రామ్స్ అందుబాటులోనికి రానున్నాయి.

NRTI నూతన కోర్సులు – ముఖ్య వివరాలు :

బీ. టెక్ యూజీ ప్రోగ్రామ్స్ :

1). బీ.టెక్ ఇన్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజిన్ :

ఈ కోర్సు మొత్తం కాల వ్యవధి మొత్తం 4 సంవత్సరాలు.

2). రైల్ సిస్టమ్ అండ్ కమ్యూనికేషన్ :

ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి మొత్తం 4 సంవత్సరాలు.

ఎంబీఏ కోర్సులు :

1). ఎంబీఏ ఇన్ ట్రాన్స్ పోరేషన్ మానేజ్మెంట్ :

ఈ కోర్సు మొత్తం  కాలవ్యవధి మొత్తం 2 సంవత్సరాలు.

2). ఎంబీఏ ఇన్ సప్లై చైన్  మానేజ్మెంట్ :

ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి మొత్తం 2 సంవత్సరాలు.

ఎమ్మెస్సీ ప్రోగ్రామ్స్ :

1). ఎమ్మెస్సీ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటెగ్రిషన్ :

ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి  2 సంవత్సరాలు.

2). ఎమ్మెస్సీ ఇన్ ట్రాన్స్ పోర్ట్ టెక్నాలజీ పాలసీ :

ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 2 సంవత్సరాలు.

3). ఎమ్మెస్సీ ఇన్ ట్రాన్స్ పోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ అనలిటిక్స్ :

ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 2 సంవత్సరాలు.

డిగ్రీ కోర్సులు :

1). బీబీఏ ఇన్ ట్రాన్స్ పోరేషన్ మానేజ్మెంట్ :

ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 3 సంవత్సరాలు.

2). బీఎస్సీ ఇన్ ట్రాన్స్ పోరేషన్ టెక్నాలజీ :

ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 3 సంవత్సరాలు.

ముఖ్య గమనిక :

రైల్వే ఉద్యోగాల కోసం భారతీయ రైల్వే అభ్యర్థులకు అందిస్తున్న ఈ నూతన కోర్సులకు సంబందించిన మరింత ముఖ్య మైన సమాచారం కోసం అభ్యర్థులు నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్ పోరేషన్ ఇన్స్టిట్యూట్ అధికార వెబ్సైటు ను చూడవచ్చును.

website

కామెంట్‌లు లేవు: