18, నవంబర్ 2020, బుధవారం

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

4 సంవత్సరాలకు గాను కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు కాంప్లెక్స్ నందు పని చేయవలసి ఉంటుంది. Hindustan Aeronautics Limited Job Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ16 నవంబర్ 2020
ఆన్లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ6 డిసెంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 17 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

ఫిట్టర్ మరియు ఎయిర్ ఫ్రేమ్ ఫిట్టర్ మరియు సెక్యూరిటీ గార్డ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

అర్హతలు:

ఫిట్టర్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ITI పూర్తి చేసి ఉండాలి మరియు ఎయిర్ ప్రేమ్  పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లమో పూర్తి చేసి ఉండాలి

మరియు సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు PUC లేదా ఇంటర్మీడియట్ లేదా SSLC పాస్ అయ్యి ఉండాలి మరియు సంబంధిత  విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

వయసు:

28 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

47790 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

రిటన్ టెస్ట్ మరియు ఫిజికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు  వెబ్సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

కామెంట్‌లు లేవు: