18, నవంబర్ 2020, బుధవారం

BEL మచిలీపట్నం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

BEL మచిలీపట్నం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మచిలీపట్నం లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.


ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ3 డిసెంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 9 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్  విభాగంలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది

అర్హతలు:

ట్రైని OL ఆఫీసర్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో BE,B tech,BSc చేసి ఉండాలి

and ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత విభాగంలో  MBA చేసి ఉండాలి

మరియు పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో కావాల్సిన పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి

వయసు:

పోస్ట్ ని బట్టి 25 నుండి 33 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

పోస్ట్ ని బట్టి 25000 నుండి 35000 వరకు జీతం ఇవ్వడం జరిగింది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క అర్హత లో ఉన్న మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి వీడియో బేస్డ్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించాల్సిన ఫీజు:

SC ST PWD కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు పోస్ట్ ని బట్టి 200 నుండి 500 వరకు ఫీజు చెల్లించవలసి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీసియల్ వెబ్సైట్ సంప్రదించగలరు

కామెంట్‌లు లేవు: