స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు
ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియా మొత్తంలో ఉన్న ఎస్బిఐ
బ్రాంచ్ లలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన తేదీలు | 14 నవంబర్ 2020 నుండి 4 డిసెంబర్ 2020 వరకు |
ఫీజు చెల్లించవలసిన తేదీలు | 14 నవంబర్ 2020 నుండి 4 డిసెంబర్ 2020 వరకు |
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్టికెట్స్ విడుదల చేసే తేదీ | డిసెంబర్ 3 వ వారంలో |
ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగు తేదీ | 31 డిసెంబర్ 2020 నుండి 5 జనవరి 2020 వరకు |
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదల అయ్యే తేదీ | జనవరి 3 వారంలో |
మెయిన్స్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలు | జనవరి 3 వారంలో |
మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగు తేదీ | 29 జనవరి 2021 |
మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదల అయ్యే తేదీ | ఫిబ్రవరి 3 లేదా 4 వారాల్లో |
ఫేస్-3 కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలు | ఫిబ్రవరి 3 లేదా 4 వారాల్లో |
ఇంటర్వ్యూ జరుగు తేదీలు | ఫిబ్రవరి లేదా మార్చి 2021 |
ఫైనల్ రిజల్ట్ విడుదల అయ్యే తేదీ | మార్చి 2021 చివరి వారంలో |
ప్రి ఎగ్జామినేషన్ ట్రైనింగ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీ | 2020 డిసెంబర్ రెండో వారంలో |
ప్రి ఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహించే తేదీలు | డిసెంబర్ 2020 3 లేదా 4 వారాల్లో |
పోస్టుల సంఖ్య:
ప్రొబేషనరీ ఆఫీసర్ విభాగంలో మొత్తం 2000 ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది
విభాగాల వారీగా ఖాళీలు:
SC | 300 |
ST | 150 |
OBC | 540 |
EWS | 200 |
జనరల్ | 810 |
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి
వయస్సు:
21 నుండి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓ బి సి అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
జీతం:
23700 నుండి 42020 వరకు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఎగ్జామినేషన్ సెంటర్స్:
ఆంధ్రప్రదేశ్లోని అభ్యర్థులకు చీరాల,
చిత్తూరు,
ఏలూరు,
గుంటూరు,
కడప,
కాకినాడ,
కర్నూలు,
నెల్లూరు,
ఒంగోలు,
రాజమండ్రి,
శ్రీకాకుళం,
తిరుపతి,
విజయవాడ,
విశాఖపట్నం,
విజయనగరం లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ కలదు
మరియు తెలంగాణలోని అభ్యర్థులకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో ఎగ్జామినేషన్ సెంటర్ కలదు
చెల్లించాల్సిన ఫీజు:
SC ST PWD క్యాటగిరి లకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
EWS, జనరల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 750 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి