5, జనవరి 2021, మంగళవారం

జనవరి4 నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్

అమరావతి/నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాల కోసం జనవరి నాలుగో తేదీ నుంచి 11 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి తెలిపారు. నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు ట్రిపుల్ ఐటీలలో చేరేందుకు నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌కు ఎక్కడైనా హాజరు కావొచ్చన్నారు. కాగా, 4 ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ల కౌన్సెలింగ్ నాలుగో తేదీ నుంచి నూజివీడు, ఆర్కేవేలీల్లో జరుగుతుందని వర్సిటీ చాన్సలర్ పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు: