5, జనవరి 2021, మంగళవారం

🕉– *జనవరి చివరి నాటికి బర్డ్‌లో ఐటి అప్లికేషన్ అమలు కావాలి- అధికారులకు టీటీడీ ఈవో ఆదేశం*


        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:  జనవరి చివరి వారం లోపు బర్డ్ ఆసుపత్రి నిర్వహణ, సేవలకు సంబంధించిన ఐటి అప్లికేషన్ అమలు కావాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

★ టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్లో శనివారం ఆయన బర్డ్, ఐటి విభాగం అధికారులతో సమావేశమయ్యారు. బర్డ్ ఆసుపత్రి నిర్వహణ విధానానికి సంబంధించిన ఐటి అప్లికేషన్ పై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ అప్లికేషన్ లో ఆసుపత్రి నిర్వహణ, క్లినికల్, ఆర్థిక వ్యవహారాలు మూడు విభాగాలుగా ఉండాలన్నారు. అవుట్ పేషెంట్, ఇన్పేషెంట్,  వీరిద్దరికీ సంబంధించిన లెబరేటరీ, ఫార్మసీ మాడ్యూల్స్, డిశ్చార్జ్ మాడ్యూల్ ఇందులో ఉండాలని అధికారులకు సూచించారు. టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తో సమన్వయం చేసుకుంటూ బర్ద్ అధికారులు స్టోర్స్ ఇన్వెంటరీ నిర్వహించాలన్నారు.  ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఆసుపత్రి పరిపాలన,  మెటీరియల్ మరియు మెడిసిన్ అంశాలు ఈ అప్లికేషన్ లో పొందుపరచాలని ఈవో చెప్పారు. బర్ద్ లోని ఏడు ఆపరేషన్ థియేటర్ల సామర్థ్యం,  డాక్టర్ల పని తీరు, బిల్లింగ్ విధానం గురించి బర్ద్, ఐటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బర్ద్ ఆసుపత్రి గౌరవ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, ఐటి ఇంచార్జ్ శ్రీ శేషారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
 *Dept.Of PRO TTD.*

కామెంట్‌లు లేవు: