8, జనవరి 2021, శుక్రవారం

🔳పీజీ ప్రవేశాలు ప్రారంభం




ధ్రువపత్రాన్ని అందజేస్తున్న రెక్టార్‌ కృష్ణానాయక్‌

ఎస్‌.కె.విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: పీజీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయింది. తొలిరోజు ఐదు సబ్జెక్టుల్లో మొత్తం 542 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా..237 మంది మాత్రమే హాజరయ్యారు. సగానికి పైగా విద్యార్థులు దూరమయ్యారు. ఈ ప్రభావం పీజీ సీట్ల భర్తీపై పడనుంది. వర్సిటీలోని ప్రవేశాల కార్యాలయంలో గురువారం స్కూసెట్‌ ద్వారా ర్యాంకు సాధించిన విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభించారు. కార్యక్రమంలో రెక్టార్‌ కృష్ణానాయక్‌, ప్రవేశాల సంచాలకులు తిమ్మానాయక్‌ పాల్గొని, పర్యవేక్షించారు. శుక్రవారం మొత్తం 614మంది విద్యార్థులకు ధృవపత్రాల పరిశీలన చేపట్టనున్నారు

కామెంట్‌లు లేవు: