1. ఆల్రెడీ ల్యాండ్ ఉన్న వారికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేస్తుందా లేదా బ్యాంకు ద్వారా ఋణం ఇప్పిస్తుందా?
జ. స్వంత ఇంటి స్థలం ఉన్న వారికి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద ప్రభుత్వం దశల వారిగా ఇళ్ళు
మంజూరు చేస్తుంది.
2. ఇంతకు ముందు ప్రభుత్వం లో బిల్ సాంక్షన్ కానీ వారు ఇప్పుడు ఈ పథకానికి అర్హులైనా?
జ: అర్హులు
3. గ్రామం లో స్థలం వున్నవారు పేదలందరికీ ఇల్లు పథకానికి అర్హులు కాదు అయితే స్థలం వుండి ఇల్లు కట్టుకోవటనికి ప్రభుత్వం ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది ?
జ.స్వంత ఇంటి స్థలం ఉన్న వారికి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద ప్రభుత్వం దశల వారిగా ఇళ్ళు
మంజూరు చేస్తుంది.
4. పేదలందరికీ ఇళ్ళు పధకానికి అర్హత పొందడానికి అర్హత వయస్సు ఎంత?
జ.వివాహము జరిగి, బియ్యం కార్డు కలిగిన ప్రతి కుటుంబము పేదలందరికీ ఇళ్ళు పధకానికి అర్హులు.
5. పట్టణ ప్రాంతాల్లోని కొంతమందికి సొంత స్థలం ఉంది, వారికీ ఈ పథకం ద్వారా కూడా ఇంటి స్థలం వచ్చింది. ఇప్పుడు ఆ స్థలం లో వారు ఇళ్ళు కట్టుకోకపోతే వారికీ ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా?
జ. సొంత ఇంటి స్థలం కలిగివారు ప్రభుత్వం ఇచ్చు ఇంటి స్థలం పొందుటకు అనర్హులు.
6. సింగల్ పర్సన్ రేషన్ కార్డు ఉన్న మహిళకు ఈ పథకం ద్వారా ఇంటి పట్టా అందుతుందా?
జ: ప్రభుత్వపు నిబంధనల ప్రకారము అర్హులైనచో ఇంటి పట్టా అందుతుంది.
7. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన 3 ఆప్షన్స్ లో రెండవ ఆప్షన్ ప్రకారం లబ్ధిదారులు తమకు నచ్చిన నమూనాలో ఇళ్ళు నిర్మించుకోవచ్చా?
జ. ప్రస్తుత విదానం ప్రకారము ప్రభుత్వ నమూనా ప్రకారము మాత్రమే ఇంటి నిర్మాణం చేయవలెను.
8.హౌస్ సైట్స్ లబ్ధిదారులు జాబ్ కార్డు కావాలి అని చెప్తున్నారు, అవి ఎప్పుడూ అప్లై చేసుకోవాలి.
జ.ఇంటి నిర్మాణ మంజూరు పత్రము ఇచ్చిన వెంటనే అప్లై చేసుకోవాలి.
9. వాలంటీర్ యాప్ లో ఇంటి స్థలాలకు దరఖాస్తు చేసుకొని వారి పేర్లు కూడా వస్తున్నాయి ఏమి చేయాలి?
జ.వారికి ఆప్షన్ తీసుకోవలసిన అవసరము లేదు.
10. ఇంటి పట్టాలకు అర్హతల జాబితాలో ఉన్నారు, కాని వాళ్ళకి పట్టాలు రాలేదు, కారణం ఏంటి అని అడిగితేవారు లోన్లు తీసుకోని ఉన్నారు అని చెప్తున్నారు.కాని ఇంతవరకు వారు ఎలాంటి లోన్లు తీసుకోలేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?
జ.వివరములకొరకు సంబదిత గ్రామ /వార్డ్ సచివాలయంలో సంప్రదించండి.
11. ఇళ్ళ పట్టాలు వచ్చాయి కాని, మాకు ఇంటి స్థలం ఎక్కడా చూపించలేదు, కావున లబ్ధిదారుల సొంత స్థలం లో ఇళ్ళు కట్టుకోవచ్చా, లేక ప్రభుత్వమే స్థలం ఇస్తుందా?
జ.ఇంటి స్థలం సుపిచుటకు తాసిల్దార్ ను సంప్రదించండి.
12.గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాలో ఎటువంటి ఇళ్లు నిర్మించకుండా అలాగే ఉంచుకోవచ్చునా?
జ.ఉంచుకోరాదు.
13.గత ప్రభుత్వంలో కట్టిన వారికి ఎటువంటి అధికారిక ఎంట్రీ జరగలేదు. ఇంటి ఐడి ఏర్పాటు కాలేదు. వారు కట్టుకున్న ఇంటికి అన్ని అర్హతలు ఉంటే బిల్లులు మంజూరు అవుతాయా?
జ.అవుతాయి.
14.పేదలందరికీ ఇళ్ళు పథకానికి దరఖాస్తు చేయడానికి హౌసింగ్ డిపార్టుమెంటు వారు దరఖాస్తుదారుల పాత రేషన్ కార్డ్ అడుగుతున్నారు, కాని వారి దగ్గర న్యూ రైస్ కార్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?
జ. కొత్త బియ్యం కార్డు నెంబరు సరిపోతుంది.
15. ఫస్ట్ లిస్టులో పేరు వచ్చింది సెకండ్ లిస్టులో పేరు వచ్చింది ఫైనల్ లిస్టులో పేరు రాలేదు. ఏమి చేయాలి?
జ. వివరములకొరకు సంబదిత గ్రామ | వార్డ్ సచివాలయంలో సంప్రదించండి.
16. కొంతమందికి ఆధార్ కార్డు ప్రాబ్లం వలన ఇళ్ళ పట్టాలు రాలేదు, వారికీ సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు, ఏమి చేయాలి?
జ.పరిష్కారం కొరకు తాసిల్దార్ ను సంప్రదించండి.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
5, జనవరి 2021, మంగళవారం
హోసింగ్ కు సంబంధిత ప్రశ్నలు సమాదానాలు : Housing - FAQs
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి