డిసెంబర్ 30 వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 2 పరీక్షలో అడిగిన ప్రశ్నలు :
1). రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య?
జవాబు : 250
2).భారత దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభం అయిన సంవత్సరం?
జవాబు : అక్టోబర్ 2, 2014
3). భేటీ బచావో – భేటీ పడవో అనే భారత కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఎపుడు మొదలైనది?
జవాబు : జనవరి 22,2015
4).మీథేన్ ఫార్ములా?
జవాబు : CH 4
5). ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2019 థీమ్ ఏమిటి?
జవాబు : ఎయిర్ పొల్యూషన్ (వాయు కాలుష్యం )
6). కాంగ్రెస్ పార్టీ ఏ సంవత్సరంలో ప్రారంభం అయినది?
జవాబు : డిసెంబర్ 28,1885
7).2011 వ సంవత్సరం ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక అక్షరాస్యత కలిగి ఉంది?
జవాబు : కేరళ
8). చరిత్రలో అంగ్లో – మైసూర్ యుద్దాలు ఎన్ని సార్లు జరిగాయి?
జవాబు : 4 సార్లు
9). పేస్ బుక్ వ్యవస్థాపకుడు ఎవరు?
జవాబు : మార్క్ జుకర్ బర్గ్
10). సార్క్ లో మొత్తం సభ్యుల సంఖ్య?
జవాబు : 8
11).మర్రి చెట్టు శాస్త్రీయ నామం?
జవాబు : ఫీకస్ బెంగాలెన్సిస్
12).ప్రపంచ ప్రతిష్టత్మక అవార్డు నోబెల్ బహుమతిని మొత్తం ఎన్ని రంగాలలో ప్రదానం చేస్తారు?
జవాబు : 6 రంగాలు
13).1931 భారత జాతీయ మహాసభలకు నాయకత్వం వహించారు?
జవాబు : సర్దార్ వల్లభాయ్ పటేల్
14).కెల్విన్ లో నీరు గడ్డకట్టే స్థానం?
జవాబు : 273.2కే
15). గద్దర్ పార్టీ సహా వ్యవస్థాపకుడు?
జవాబు : సోహాన్ సింగ్ బక్నా
16). OLE సంక్షిప్త నామం?
జవాబు : OBJECT LINKING & EMBEDDING
17). ప్రాథమిక హక్కులు ను భారత రాజ్యాంగంలో ఈ భాగానికి చెందినవి?
జవాబు : పార్ట్ – III (ఆర్టికల్స్ 12 -35)
18).ఆర్యభట్ట సాటిలైట్ ను ఏ సంవత్సరం లో ప్రయోగించారు?
జవాబు : 1975
19). భారత రత్న అవార్డును ప్రారంభించిన సంవత్సరం?
జవాబు : 1954
20). తాజ్ మహల్ నిర్మాణాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జవాబు : 1632
21). వరకట్న చట్టాన్ని నిషేదించిన సంవత్సరం?
జవాబు : 1961
22).2019 వ సంవత్సరంలో WHO చేత మలేరియా రహితదేశాలుగా గుర్తించబడిన దేశాలు?
జవాబు : ఆల్జీరియా మరియు అర్జెంటినా
23). కుదుంబ శ్రీ అనే పథకం ఏ రాష్ట్రానికి చెందినది?
జవాబు : కేరళ
24). స్వర్ణ చతుర్బుజీ ని ఏ ప్రధానికాలంలో ఏర్పాటుచేసారు?
జవాబు : అటల్ బిహారి వాజ్ పేయ్
25). భారత దేశంలో బంగారం ను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం?
జవాబు : కర్ణాటక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి