భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) పైప్‌లైన్స్ విభాగంలో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 47
పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్ అసిస్టెంట్(మెకానికల్, ఆపరేషన్స్, ఎలక్ట్రికల్, టీ-ఐ)-27, టెక్నికల్ అటెండెంట్-20.
అర్హతలు:
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ (మెకానికల్): కనీసం 55శాతం మార్కులతో మెకానికల్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల ఫుల్‌టైం డిప్లొమా/లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణలవ్వాలి.
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్): కనీసం 55శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల ఫుల్‌టైం డిప్లొమా/లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణలవ్వాలి.
- ఇంజనీరింగ్ అసిస్టెంట్ (టీ-ఐ): కనీసం 55శాతం మార్కులతో ఈసీఈ/ఈటీఈ /ఐసీఈ/ఐపీసీఈ/ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల ఫుల్‌టైం డిప్లొమా/లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణలవ్వాలి.
- ఇంజనీరింగ్ అసిస్టెంట్(ఆపరేషన్స్): కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఫుల్‌టైం డిప్లొమా ఇంజనీరింగ్/లేటరల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణలవ్వాలి.
- టెక్నికల్ అటెండెంట్: పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో (ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్ తదితరాలు) ఐటీఐ ఉత్తీర్ణలవ్వాలి. సంబంధిత ట్రేడుల్లో ఎస్‌సీవీటీ/ఎన్‌సీవీటీ జారీచేసిన ట్రేడ్ సర్టిఫికేట్/నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
వయసు: 22.12.2020 నాటికి కనీస వయసు 18 ఏళ్లకు తగ్గకుండా.. గరిష్ట వయసు 26 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్/ప్రొఫిషియన్సీ/ఫిజికల్ టెస్ట్(ఎస్‌పీపీటీ) ద్వారా ఎంపిక చేస్తారు. స్కిల్/ప్రొఫిషియన్సీ/ఫిజికల్ టెస్ట్(ఎస్‌పీపీటీ)ని కేవలం అర్హత కోసం మాత్రమే నిర్వహిస్తారు. తుది ఎంపిక రాతపరీక్షలో సాధించిన మార్కులు, ఎస్‌పీపీటీలో ఫిట్‌నెస్ ఆధారంగా ఉంటుంది. రాతపరీక్షలో కనీసం 40శాతం మార్కులు సాధించినవారు మాత్రమే ఎస్‌పీపీటీకి అర్హత సాధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 15, 2021.
పరీక్షా తేది: ఫిబ్రవరి 14, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.iocl.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి