5, జనవరి 2021, మంగళవారం

🕉– *శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారమైన ధార్మిక కార్యక్రమాలు :*




🟢– డిసెంబరు 25న వైకుంఠ ఏకాదశి, గీతాజయంతి పర్వదినాల‌ను పురస్కరించుకుని దాదాపు 4 గంటల‌ పాటు భగవద్గీత అఖండ పారాయణం నిర్వహణ.

🟢– ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 6 నుండి 6.45 గంటల‌ వరకు – మార్గశీర్షం విష్ణుతత్వం, ఉదయం 8.30 నుండి 9.30 గంటల‌ వరకు – తిరుప్పావై

🟢– శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి, చెన్నై ట్రిప్లికేన్‌లోని శ్రీ పార్థసారథిస్వామి, భద్రాచ‌లంలోని శ్రీరామచంద్రుని ఆల‌యాల‌ నుండి ఉత్తర ద్వార దర్శనం (వైకుంఠ ఏకాదశి నాడు) ప్రత్యక్ష ప్రసారం.

🟢– శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాయంలో డిసెంబరు 26న శ్రీ వ్రతం, 27న కుబేర వ్రతం.

🟢– జనవరి 2న 8వ విడత అఖండ సుందరకాండ పారాయణం.

🟢– జ‌న‌వ‌రి 8న క‌ర్నూలు న‌గ‌రంలో ధ‌నుర్మాస ల‌క్ష్మీదీపారాధ‌న‌.

🟢– జ‌న‌వ‌రి 14న టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గోదాక‌ల్యాణం.

🕉 *ప్రజాసంబంధాల‌ విభాగం :*

🟢– దేశం న‌లుమూలల‌ నుండి విచ్చేసిన 2000 మంది శ్రీవారి సేవకుల‌తో భక్తుల‌కు సేవ‌లు.

🕉 *ఆల‌యాల‌కు ప‌టిష్ట భ‌ద్ర‌త : సివిఎస్వో*

టిటిడి ప‌రిధిలో మొత్తం 50 ఆల‌యాలు ఉన్నాయ‌ని, వీటి వ‌ద్ద ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి తెలిపారు. 41 ఆల‌యాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామ‌ని, మిగిలిన 9 ఆల‌యాల్లో జ‌న‌వ‌రి 15వ తేదీనాటికి పూర్తి చేస్తామ‌ని చెప్పారు. జ‌న‌వ‌రి 5వ తేదీ మంగ‌ళ‌వారం నుండి పాప‌వినాశ‌నం మార్గంలో భ‌క్తుల‌ను అనుమ‌తిస్తామ‌ని వెల్ల‌డించారు.
 *Dept.Of PRO TTD.*

కామెంట్‌లు లేవు: