యూపీఎస్సీ నుండి భారీ నోటిఫికేషన్,400 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు నావల్ అకాడమీ (NA) లో ఖాళీగా ఉన్న పోస్టుల ప్రవేశాలకు గాను నోటిఫికేషన్ విడుదల అయినది.
ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివాహం కానీ పురుష అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. UPSC 400 Jobs Recruitment 2021 Telugu
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది | జనవరి 1, 2021 |
దరఖాస్తుకు చివరి తేది | జనవరి 19,2021 |
పరీక్ష నిర్వహణ తేది | ఏప్రిల్ 18,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) | 370 |
ఆర్మీ | 208 |
నేవీ | 42 |
ఎయిర్ ఫోర్స్ | 120 |
నావల్ అకాడమీ (10+2క్యాడర్ ఎంట్రీ ) | 30 |
మొత్తం ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మాథ్స్ / ఫిజిక్స్ /కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) కోర్సు లో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు అవసరం అని నోటిఫికేషన్ లో తెలిపారు. మరింత ముఖ్యమైన సమాచారం కొరకు క్రింది నోటిఫికేషన్ ను అభ్యర్థులు చూడగలరు.
వయసు :
జూలై 2,2002 నుండి జూలై 1,2005 సంవత్సరాల మధ్య జన్మించిన వివాహం కానీ పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం మరియు ఫీజు :
ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.
ఓబీసీ /జనరల్ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష /SSB టెస్ట్ /ఇంటర్వ్యూ విధానముల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40,000 రూపాయలు నుండి 80,000 రూపాయలు జీతం లభించునున్నది.
పరీక్ష కేంద్రాలు – నగరాలు :
ఈ ఉద్యోగాల పరీక్షలకు అభ్యర్థులు హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం నగరాలను ఎంపిక చేసుకోవచ్చు.
ఫోన్ నంబర్లు :
011-23385271,
011-23381125,
011-23098543
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి