8, జనవరి 2021, శుక్రవారం

🔳డిగ్రీ మార్కులతోనూ ఎంబీఏ ప్రవేశాలు

ఈనాడు, అమరావతి: ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్షతోపాటు డిగ్రీ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. కొవిడ్‌ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశ అర్హత పరీక్షలు నిర్వహించలేదని, అలాంటి వారు ఏదో ఒక అర్హత పరీక్షను పరిగణనలోకి తీసుకొని విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని సూచించింది. మిగిలిపోయిన సీట్లను డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా భర్తీ చేయాలని పేర్కొంది

కామెంట్‌లు లేవు: