TTD NEWS
🕉– *టిటిడిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు*
➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ప్రాంగణంలోని మైదానంలో మంగళవారం ఘనంగా జరిగాయి.
👉 ఈ సందర్భంగా టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్.కె.ఎస్.జవహర్ రెడ్డి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. వివరాలు వారి మాటల్లోనే….
■ ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల సేవలో తరిస్తున్న ధర్మకర్తల మండలికి,
అధికార యంత్రాంగానికి,
అర్చకులకు,
సిబ్బందికి,
భద్రతా సిబ్బందికి,
విశ్రాంత సిబ్బందికి,
శ్రీవారి సేవకులకు,
స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు, భక్తులకు మరియు మీడియా మిత్రులకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
■ ఎందరో యోధుల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడిగా నిలిచాడు. స్వాతంత్య్రానంతరం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర పర్వదినం రోజున టిటిడి భక్తులకు చేస్తున్న అనేక సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
🕉 *శ్రీవారి ఆలయం :*
➖〰〰〰〰〰〰➖
★– టిటిడి నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్యకైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం.
★– కోవిడ్-19 నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర టిటిడి ఆలయాలలో బ్రహ్మూెత్సవాలను ఏకాంతంగా నిర్వహించాం. కోవిడ్ పరిస్థితుల్లో తమవంతు సాయంగా తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, రెండో సతం, తిరుచానూరులోని పద్మావతి నిలయంలో రోగులకు వసతి కల్పించాం. క్లిష్టసమయంలో భక్తులకు, రోగులకు ఆపన్నహస్తం అందించాం.
🕉 *శ్రీవారి దర్శనం*
➖〰〰〰〰〰➖
★– ఉద్యోగులు, భక్తుల ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం. తితిదే నిబంధనలు పాటిస్తూ సంతృప్తికరంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్న భక్తులను అభినందిస్తున్నాము.
★– వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల సాంప్రదాయాలను పునరుద్ధరింపచేస్తూ శ్రీమాన్ పెద్దజీయంగార్లు, ఆగమసలహాదారులు మరియు 26 మంది పీఠాధిపతులు మరియు మఠాధిపతులను సంప్రదించి వారి అభిప్రాయం మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలో మొట్టమొదటిసారిగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి సుమారు 4.26 లక్షల మంది భక్తులను దర్శనభాగ్యం కల్పించాం. మొట్టమొదటిసారిగా 3 లక్షల మంది సామాన్య భక్తులకు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా ఎలాంటి సిఫార్సులు లేకుండా టోకెన్లు జారీచేసి 10 రోజులలో వైకుంఠద్వార దర్శనభాగ్యం కల్పించాం. దాతలకు వైకుంఠ ద్వార ప్రవేశం కల్పించడం కూడా ఇదే మొదటిసారి.
★– ఫిబ్రవరి 19న రథసప్తమి సందర్భంగా ఆలయ మాడ వీధుల్లో స్వామివారి వాహనసేవలు నిర్వహిస్తాం. యథాప్రకారం దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తాం.
★– ధర్మప్రచారంలో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్టు (శ్రీవాణి) ద్వారా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మత్స్యకార ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నాం.
★ ఈ ట్రస్టుకు రూ.10 వేలు విరాళం అందించిన దాతలకు ఒకసారి విఐపి బ్రేక్ దర్శనం కల్పిస్తున్నాం. ఈ ట్రస్టుకు రూ.100 కోట్ల పైగా విరాళాలు అందాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను.
*Dept.Of PRO TTD.*
కామెంట్‌లు