16, ఫిబ్రవరి 2021, మంగళవారం

ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ ఈ రోజు పరీక్ష ఫీజులపై కీలక ప్రకటన చేసింది. ఫస్ట్ ఇయర్ కు సంబంధించిన ఫీజుల వివరాలు, లాస్ట్ డేట్ కు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ ధర రూ. 10 గా నిర్ణయించారు. జనరల్ కోర్సులకు సంబంధించిన ఎగ్జామ్ ఫీజును రూ. 490గా నిర్ణయించారు. ఒకేషనల్ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 680ను నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. జనరల్/ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు సబ్జెక్టుల ఫీజును రూ. 135గా నిర్ణయించారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ బ్యాక్ లాగ్ అభ్యర్థులు ప్రాక్టికల్ పరీక్షకు హాజరయ్యేందుకు రూ. 190ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మార్చి ఒకటి లోగా ఫీజులు చెల్లించాలని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఆఖరి తేదీని పొడిగించేది లేదని స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు: