తిరుమల, 19 ఫిబ్రవరి, 2021
ఫిబ్రవరి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 20న శనివారం ఉదయం 9 గంటలకు, గదుల కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదేవిధంగా,
మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను ఫిబ్రవరి 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను, గదులను బుక్ చేసుకోవాలని కోరడమైనది.
----- తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి