20, మార్చి 2021, శనివారం

10th, ఇంటర్ అర్హతలతో CARS 24 సంస్థలో ఉద్యోగాలు, 25,000 వరకూ జీతం | CARS 24 Jobs 2021 Telugu

10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్హతలతో CARS 24 సంస్థలో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ప్రకటించినది.

అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ కాబోయే ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ అయ్యే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరు /కర్ణాటక లలో పోస్టింగ్స్ కల్పించబడుతాయి.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేదిమార్చి 20, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

కార్ ఇవాల్యుయేషన్ ఇంజనీర్స్50

అర్హతలు :

10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యా అర్హతలు కలిగి ఉండి, ఆటో మొబైల్ రంగంలో 6 నెలల నుండి 2 సంవత్సరాలు అనుభవం ఉన్న పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఫిక్స్డ్ శాలరీ + 10,000 రూపాయలు వరకూ ఇన్సెంటివ్స్ +పెట్రోల్ అలోవెన్స్ మొత్తం అన్ని కలుపుకుని అనుభవం ఆధారంగా నెలకు 15,000 రూపాయలు నుండి 25,000 రూపాయలు వరకూ జీతములు ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లభించనున్నాయి.

NOTE :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఫోర్ వీలర్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని ప్రకటనలో తెలిపారు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్ :

1800-425-2422

Registration Link 

Notification

 

కామెంట్‌లు లేవు: