28, మార్చి 2021, ఆదివారం

తిరుపతి యూనివర్సిటీ లో టీచింగ్ , నాన్ టీచింగ్ ఉద్యోగాలు | Tirupati Recruitment 2021

తిరుపతి నగరంలో ఉన్న  నేషనల్ సాంస్క్రీట్ యూనివర్సిటీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ – నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ తాజాగా విడుదల అయ్యాయి.

స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిఏప్రిల్ 16, 2021( 5:30 PM )

విభాగాల వారీగా ఖాళీలు :

టీచింగ్ పోస్టులు :

అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ యోగ1
అసోసియేట్ ప్రొఫెసర్ అద్వైత వేదాంత1
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ విశిస్టాద్వైత వేదాంత1
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సాహిత్య1
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సాంస్క్రీట్ ఎడ్యుకేషన్1

నాన్ – టీచింగ్ పోస్టులు :

ప్రైవేట్ సెక్రటరీ2
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)3

అర్హతలు :

సంబంధిత స్పెషలైజేషన్ లో పీహెచ్. డీ కోర్సులను పూర్తి చేసి (లేదా ) కనీసం 55% మార్కులతో సంబంధిత పీజీ కోర్సులలో ఉత్తీర్ణతను సాధించి 8 సంవత్సరాల బోధన అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 50% మార్కులతో మాస్టర్డిగ్రీ కోర్సులను పూర్తి చేసి , నెట్ /స్లెట్ /సెట్ పరీక్షలలో అర్హతలు సాధించి ఉండాలని ప్రకటనలో పొందుపరిచారు.

ప్రైవేట్ సెక్రటరీ పోస్టులకు డిగ్రీ అర్హతలు కలిగి ఉండి, హిందీ /ఇంగ్లీష్ లాంగ్వేజెస్ స్టేనో గ్రాఫీ లో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

డిగ్రీ అర్హతలతో పాటు టైపింగ్ లో అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ క్లర్క్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు అఫీసీయల్ నోటిఫికేషన్స్ ను  చూడవచ్చును.

వయసు :

విభాగాలను అనుసరించి 18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ , ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 800 రూపాయలు ను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

అన్ని కేటగిరీల మహిళలకు , ఎస్సీ / ఎస్టీ కేటగిరి అభ్యర్థులు మరియు దివ్యాంగులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ విధానముల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

టీచింగ్ విభాగంలో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి 50,000 రూపాయలు నుండి 2,17,100 రూపాయలు వరకూ నెలకు జీతముగా లభించనుంది.

నాన్ – టీచింగ్ విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు 7th పే లెవెల్ కమీషన్ ప్రకారం జీతములు లభించనున్నాయి.

NOTE :

ఆన్లైన్ విధానంలో వెబ్సైటు ద్వారా డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్ ఫారమ్ లను పూర్తి చేసిన తరువాత , సంబంధిత ఫీజు మరియు విద్యా అర్హతల సర్టిఫికెట్స్ కాపీ లను ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను అని ప్రకటనలో తెలిపారు.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా (అడ్రస్ ) :

Registrar,National Sanskrit University,Tirupati – 517507,Chittoor District,Andhrapradesh.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

0877-2286799

Website

Notification

కామెంట్‌లు లేవు: