6, జులై 2021, మంగళవారం

బీఎస్‌ఎఫ్‌లో పారామెడికల్, వెటర్నరీ స్టాఫ్‌ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేది: 24.07.2021


భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన డైరక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌)..పారా మెడికల్, వెటర్నరీ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 110
పోస్టుల: పారా మెడికల్‌స్టాఫ్, వెటర్నరీ స్టాఫ్‌.

ఎన్‌ఐ(స్టాఫ్‌ నర్స్‌): ఇంటర్మీడియట్, డిగ్రీ/డిప్లొమా(జీఎన్‌ఎం) ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు.
వయసు: 30ఏళ్లు మించకూడదు.

ఏఎన్‌ఐ టెక్నీషియన్‌: 10+2, డిప్లొమా, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.29,000 చెల్లిస్తారు.
వయసు: 25ఏళ్లు మించకూడదు.

సీటీ వార్డ్‌ బాయ్‌: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.21,700 చెల్లిస్తారు.
వయసు: 23ఏళ్లు మించకూడదు.

హెచ్‌సీ(వెటర్నరీ): ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.25,500 చెల్లిస్తారు.
వయసు: 25ఏళ్లు మించకూడదు.

కానిస్టేబుల్‌: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.21,700 చెల్లిస్తారు.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 24.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bsf.gov.in

కామెంట్‌లు లేవు: