29, సెప్టెంబర్ 2021, బుధవారం

Staff Selection Commission: 3261 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌...దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021

భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
మొత్తం పోస్టుల సంఖ్య: 3261
పోస్టుల వివరాలు: మల్టీటాస్కింగ్‌ స్టాఫ్,గర్ల్స్‌ కేడెట్‌ ఇన్‌స్ట్రక్టర్, రీసెర్చ్‌ అసిస్టెంట్, కెమికల్‌ అసిస్టెంట్, జూనియర్‌ ఇంజనీర్, సైంటిఫిక్‌ అసిస్టెంట్, టెక్నీషియన్,ల్యాబొరేటరీ అటెండెంట్, మెడికల్‌ అటెండెంట్, టెక్స్‌టైల్‌ డిజైనర్‌ తదితరాలు. 
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియెట్‌/10+2, గ్రాడ్యుయేషన్‌ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి. 
వయసు: పోస్టులను అనుసరించి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్‌ టెస్ట్‌ ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021
కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష: 2022 జనవరి/ఫిబ్రవరి

వెబ్‌సైట్‌: https://ssc.nic.in

Gemini Internet

కామెంట్‌లు లేవు: