Andhra Pradesh: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎగ్జామ్స్ పెట్టడం అవసరమని విద్యాశాఖ మంత్రి సురేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని మంత్రులు తెలిపారు. కరోనా కొత్త నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. ఎగ్జామ్స్ కూడా కరోనా నిబంధలను పాటిస్తూ నిర్వహిస్తామని వెల్లడించారు.
మొత్తంగా మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు జరుగనున్నాయి. 1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. 2022 సంవత్సరం మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు.
Gemini Internet
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ దిగువన చూడండి
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ దిగువన చూడండి
కామెంట్‌లు