10, ఫిబ్రవరి 2022, గురువారం

Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ పోస్టులు.. నెలకు రూ. 70 వేలకుపైగా జీతం..

Central Bank Of India Jobs: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో సీనియర్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఇన్నర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో ఉన్న మొత్తం 19 సీనియర్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 63,480 నుంచి రూ. 78,230 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 10-02-2022న మొదలు కాగా చివరి తేదీగా 02-03-2022ని నిర్ణయించారు.

* రాతపరీక్షను మార్చి 27న నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

 

Gemini Internet

కామెంట్‌లు లేవు:

Recent

**🛑 NIOS Senior Executive Officer Recruitment** **🎓 Qualifications:** 1. **Senior Executive Officer (Instructor):** - Passed Class XII in any discipline - Diploma in Teaching Indian Sign Language (DTISL) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language 2. **Senior Executive Officer (Interpreter):** - Passed Class XII in any discipline - Diploma in Indian Sign Language Interpreting (DISLI) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language **📅 Last Date for Application Submission:** **21 days** from the date of notification issuance. **🛑 NIOS సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల నియామకం** **🎓 అర్హతలు:** 1. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇన్‌స్ట్రక్టర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ టీచింగ్ డిప్లొమా (DTISL) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం 2. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇంటర్‌ప్రెటర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటింగ్ డిప్లొమా (DISLI) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం **📅 దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:** **21 రోజులు** (నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి)