11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Deputy Manager Jobs: కేవలం ఇంటర్వ్యూతోనే.. డిగ్రీ అర్హతతో విజయవాడలో ఉద్యోగాలు

APMDC Recruitment 2022: విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APMDC) ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటి మేనేజర్‌ (deputy manager posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

పోస్టుల వివరాలు: డిప్యూటి మేనేజర్‌ పోస్టులు

విభాగాలు: లీగల్‌, మైనింగ్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌

పే స్కేల్‌: నెలకు రూ.51,000ల నుంచి 70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అదనంగా నెలకు రూ.25,000ల వరకు అలవెన్స్‌ ఇస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, లా డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా (మైనింగ్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: ఏపీఎండీసీ, కానూరు గ్రామం, పెనమలూరు మండలం, విజయవాడ 521137.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Gemini Internet

కామెంట్‌లు లేవు:

Recent

IBPS Clerk Admit Cards Released for 10,277 Posts