Alerts

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Project Assistant Jobs: బీఎస్సీ చేసి ఖాళీగా ఉన్నారా? రాత పరీక్ష లేకుండానే సీఎస్‌ఐఆర్‌లో ఉద్యోగాలు.

CSIR – IPU Recruitment 2022: న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌ – ఇన్నోవేషన్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ (IPU) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ (Project Assistant posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ పోస్టులు

విభాగాలు: కెమికల్‌, మయోటెక్‌, కెమిస్ట్రీ, ఐటీ, సివిల్‌, మెకానికల్

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా/బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

కామెంట్‌లు లేవు:

Recent

Navy: ఇండియన్ నేవీలో 260 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...