ECIL Project Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 12
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- టెక్నికల్ ఆఫీసర్లు: 3
- టెక్నికల్ అసిస్టెంట్లు: 4
- సైంటిఫిక్ అసిస్టెంట్లు: 4
- జూనియర్ ఆర్టిజన్: 1
పే స్కేల్: నెలకు రూ.18,824ల నుంచి రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్దుల వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో ఐఐటీ, ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధులకు టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 25, 2022.
అడ్రస్: నోటిఫికేషన్‌లో తెల్పిన విధంగా సంబంధిత రాష్ట్రాల్లోని ఈసీఐఎల్ జోనల్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Gemini Internet
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి