SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ వచ్చింది.
బ్యాంక్‌లో ఉద్యోగం కావాలని కలలు కంటున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి , అర్హత ఉన్న అభ్యర్థులందరూ SBI అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం అధికారిక వెబ్‌సైట్‌లో 25 ఫిబ్రవరి 2022లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ వ్రాత పరీక్షలో, అభ్యర్థుల నుండి 100 మార్కుల 80 ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలను పరిష్కరించేందుకు అభ్యర్థులకు 120 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది.
పరీక్ష కేంద్రాలు..
ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2022 మార్చి 20న గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, గౌహతి, పాట్నా, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, న్యూఢిల్లీ, నాగ్‌పూర్, పూణె, భువనేశ్వర్, జలంధర్, లూథియానా, జైపూర్, చెన్నై, హైదరాబాద్, అగర్తల, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి.. అనేక ఇతర జిల్లాల్లో నిర్వహించే అవకాశం ఉంది.
స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టులకు రిక్రూట్‌మెంట్..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం, అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి కనీసం 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇది కాకుండా, ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థి వయస్సు 40 ఏళ్లు మించకూడదు. విద్యార్హత, వయోపరిమితికి సంబంధించిన వివరణాత్మక సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.
ఖాళీల వివరాలు..
ఈ ప్రక్రియ ద్వారా 15 అసిస్టెంట్ మేనేజర్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్), 33 అసిస్టెంట్ మేనేజర్ (రూటింగ్ , స్విచింగ్) పోస్టులతో సహా మొత్తం 48 ఖాళీలను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులందరూ SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం అధికారిక వెబ్‌సైట్‌లో 25 ఫిబ్రవరి 2022 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు కూడా రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Gemini Internet
కామెంట్‌లు