SPM Recruitment 2022: కరెన్సీ నోట్లను ముద్రించే సెక్యురిటీ పేపర్ మిల్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ చదివినవారు అర్హులు
SPM Narmadapuram Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని నర్మదాపురంలోనున్న సెక్యూరిటీ పేపర్ మిల్ (SPM) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 6
పోస్టుల వివరాలు: సూపర్ వైజర్లు, వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులు
అర్హతలు:
- వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సోషల్ సైన్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.29,740ల నుంచి రూ.1,03,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- సూపర్ వైజర్ పోస్టులకు ఇంజనీరింగ్‌లో బీఎస్సీ/బీఈ/బీటెక్/డిప్లొమా (మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/కెమికల్/ఎన్విరాన్‌మెంటల్)లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.27,600ల నుంచి రూ.95,910ల వరకు జీతంగా చెల్లిస్తారు.
- జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు పీజీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.27,600ల నుంచి రూ.95,910ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 16, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Gemini Internet
కామెంట్‌లు