24, నవంబర్ 2022, గురువారం

30న సీఎం కప్ జిల్లా స్థాయి సంబరాలు పుట్టపర్తి | జిల్లా స్థాయిలో గెలుపొందినజట్లను జోనల్ స్థాయికి ఎంపిక | షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులుజగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్ లో పేర్లు నమోదుచేసుకొని డిసెంబర్ 6న కడపలో జరిగేపోటీల్లో పాల్గొనవచ్చు

C M కప్ జిల్లా స్థాయి క్రీడాసంబరాలు ఈ నెల 30న కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు చీఫ్ కోచ్ జగన్నాథరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కబడ్డీ, వాలీబాల్ పురుషులు, మహిళలకు, క్రికెట్ పోటీలు పురుషులకు మాత్రమే నిర్వహిస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులకు భోజన వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డుతో ఉదయం 9 కల్లా హాజరు కావాలని సూచించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన జట్లను జోనల్ స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. అక్కడ ప్రతిభ కనబరిచిన మొదటి, రెండు జట్లు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటా యన్నారు. న్నారు. మరిన్ని వివరాలకు ప్రకాష్, రామాంజనేయులు ఫోన్ నంబర్లు 9052575995, 8919199017లో సంప్రదించాలని సూచించారు.

కామెంట్‌లు లేవు:

Recent

IBPS Clerk Admit Cards Released for 10,277 Posts