1, జులై 2023, శనివారం

MBBS పూర్తి చేయడం ఇప్పుడు అంత సులువుకాదు ఎంబీబీఎస్‌లో చేరిన పదేళ్లలోపు నెక్స్ట్‌లో ఉత్తీర్ణత

దిల్లీ: నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్స్ట్‌)కి సంబంధించిన నిబంధనలను విడుదల చేస్తూ జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. దీని ప్రకారం ఈ పరీక్ష స్టెప్‌-1 (థియరీ), స్టెప్‌-2 (ప్రాక్టికల్‌) అన్న రెండు విభాగాలుగా జరుగుతుంది. స్టెప్‌-1లో ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. కంప్యూటర్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ మోడ్‌లో పరీక్ష జరుగుతుంది. ఎంబీబీఎస్‌లోని సబ్జెక్టులను కవర్‌చేస్తూ ఈ పరీక్ష ఆరు పేపర్లతో ఉంటుంది. అందులో మెడిసిన్‌, సర్జరీ-అనుబంధ విభాగాలు, అబ్స్ట్‌ెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, పీడియాట్రిక్స్‌, ఓటోలారింగాలజీ, ఆప్తల్మాలజీ ఉంటాయి. ఎంబీబీఎస్‌ 3/చివరి సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులంతా స్టెప్‌-1 పరీక్ష రాయడానికి అర్హులే. దీనిని ఎన్నిసార్లైనా రాయవచ్చు. స్టెప్‌-1, 2 పరీక్షలు రెండూ ఎంబీబీఎస్‌లో చేరిన పదేళ్లలోపు పూర్తిచేయాల్సి ఉంటుంది. స్టెప్‌-1లో స్కోర్‌ను మెరుగుపరుచుకోవడానికి ఎన్నిసార్లైనా రాయవచ్చు. అయితే స్టెప్‌-2 పరీక్ష పూర్తిచేసిన తర్వాత ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. స్టెప్‌-2 పరీక్షలో ప్రాక్టికల్స్‌ పైన పేర్కొన్న ఆరు పేపర్లతోపాటు, ఆర్థోపెడిక్‌, పీఎంఆర్‌ (ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌)లు అదనంగా ఉంటాయి. స్టెప్‌-1లో ప్రతి పేపర్‌లో కనీసం 50% మార్కులు పొందితేనే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. ఒకసారి పరీక్ష రాసినప్పుడు రెండు పేపర్లు ఉత్తీర్ణులై, మిగిలిన నాలుగు పేపర్లు ఫెయిల్‌ అయితే ఆ నాలుగు పేపర్లను తర్వాత జరిగే నెక్స్ట్‌ పరీక్షలో రాసి అందులో కనీస మార్కులు సంపాదించుకుంటే పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారు. దేశ, విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదివిన విద్యార్థులంతా తప్పనిసరిగా ఈ పరీక్ష రాయాలి. స్టెప్‌-1 పరీక్షలు ఏటా మే/నవంబరు నెలల్లో జరుగుతాయి. ఫలితాలు జూన్‌/డిసెంబరు మొదటివారంలో వెలువడతాయి. స్టెప్‌-2 రెగ్యులర్‌ పరీక్షలు జూన్‌/డిసెంబరు 3వ వారంలో జరుగుతాయి. ఫలితాలు అవే నెలల్లో నాలుగో వారంలో వెలువడతాయి. స్టెప్‌-2 సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబరు/మార్చి మొదటి వారంలో జరుగుతాయి. ఫలితాలు 3వ వారంలో విడుదల చేస్తారు. పీజీ అడ్మిషన్లు మే-జూన్‌లో (కౌన్సెలింగ్‌) ఉంటాయి. ఆ ప్రక్రియ జూన్‌ 30తో ముగుస్తుంది.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: