9, ఆగస్టు 2023, బుధవారం

బీటెక్‌తో హెచ్‌ఏఎల్‌లో ఉద్యోగాలు ‣ 185 డిజైన్‌/ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీల భర్తీకి నోటిఫికేషన్‌ | బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) డిజైన్‌/ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (టెక్నికల్‌) 185 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

డిజైన్‌ ట్రెయినీ పోస్టులు.. ఏరోనాటికల్‌-9, ఎలక్ట్రికల్‌-12, ఎలక్ట్రానిక్స్‌-44, మెకానికల్‌-30 ఉన్నాయి. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (టెక్నికల్‌) పోస్టులు.. కంప్యూటర్‌ సైన్స్‌-23, ఎలక్ట్రికల్‌-16, ఎలక్ట్రానిక్స్‌-13, మెకానికల్‌-30, ప్రొడక్షన్‌-5, మెటలర్జీ-3 పోస్టులు ఉన్నాయి. మొత్తం 185 పోస్టుల్లో ప్రత్యేక వర్గాలకు చెందిన అభ్యర్థులకు రిజర్వేషన్‌ ఉంటుంది. 


జనరల్‌ అభ్యర్థులు 70 శాతం మార్కులతో.. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ పాసవ్వాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 22.08.2023 నాటికి 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ లకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. 


దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ హెచ్‌ఏఎల్‌ ఉద్యోగులు ఫీజు చెల్లించనవసరం లేదు. 


సన్నద్ధతకు..

ఈ పరీక్షలో ఇంజినీరింగ్‌ సంబంధిత సబ్జెక్టులకు 100 మార్కులు కేటాయించారు. ఈ సబ్జెక్టుల మీద గట్టి పట్టు సాధిస్తే ఎక్కువ మార్కులు సంపాదించొచ్చు. గతంలో చదివిన సబ్జెక్టులే కాబట్టి కొంతవరకూ అవగాహన ఉంటుంది. మరింత దృష్టి పెడితే ఎక్కువ మార్కులు పొందొచ్చు. 


రీజనింగ్‌ విభాగంలో వెర్బల్, నాన్‌వెర్బల్, సింబల్స్, రిలేషన్‌షిప్స్, పోలికలు, భేదాలు మొదలైన వాటి మీద ప్రశ్నలు ఇస్తారు. ఇవన్నీ అభ్యర్థికి ఉండే తార్కిక పరిజ్ఞానం, అవగాహన, సమస్యా పరిష్కార నైపుణ్యాలను పరీక్షించేలా ఉంటాయి. అప్పటికప్పుడు చురుగ్గా, వేగంగా స్పందించి సమాధానాలు రాసే నేర్పు ఉంటే ఈ విభాగంలో మార్కులు సాధించవచ్చు. 


వర్తమాన వ్యవహారాల కోసం రోజూ వార్తాపత్రికను చదవాలి. ముఖ్యాంశాలను నోటుపుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. పరీక్ష ముందు వీటిని ఒకసారి పునశ్చరణ చేసుకుంటే సరిపోతుంది.   


ప్రతి విభాగంలోనూ అంశాలవారీగా మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. పాత ప్రశ్నపత్రాల్లో ఏ తరహా ప్రశ్నలు వచ్చాయో గమనించాలి. ఆయా ప్రశ్నలను సాధన చేయాలి. 


వీలైనన్ని మాక్‌ టెస్టులు రాయడం అలవాటు చేసుకోవాలి. దీంతో నిర్ణీత వ్యవధిలోనే సమాధానాలను గుర్తించగలుగుతారు. ఇలాచేయడం మొదట్లో వీలుకాకపోయినా.. సాధన వల్ల వేగంగా రాయగల నేర్పు అలవడుతుంది. 


బలాలు, బలహీనతలను సమీక్షించుకుని వెనకబడిన అంశాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. 


నెగెటివ్‌ మార్కులు లేవు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు గుర్తించి.. తెలియనివాటికి చివర్లో రాస్తే సమయం వృథా కాకుండా ఉంటుంది.  


దరఖాస్తుకు చివరి తేదీ: 22.08.2023


వెబ్‌సైట్‌: http://www.hal-india.co.in/

 

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: