ప్రాంప్ట్‌ ఇంజినీర్‌.. కోట్లలో ప్యాకేజీ! ‣ టెక్నాలజీ, ఆంగ్ల భాషపై పట్టుంటే చాలు గత ఆరేడు నెలలుగా ఐటీలో ఓ కొత్త తరహా ఉద్యోగం పేరు ఎక్కువగా వినపడుతోంది, అదే ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌. ఇందులో నైపుణ్యం చూపించగలిగిన అభ్యర్థులు కోట్లలో ప్యాకేజీలు సాధించడమే దీనికి కారణం. ప్రత్యేకమైన డిగ్రీలు అక్కర్లేని ఈ ఉద్యోగానికి.. టెక్నాలజీ, ఆంగ్ల భాష మీద పట్టు ఉంటే చాలు. ఇంకా దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టూల్స్‌ వినియోగం రోజురోజుకూ అధికమవుతోంది. వ్యక్తిగతంగా వీటిని ఉపయోగించినప్పుడు పెద్దగా కసరత్తు అవసరం లేకపోయినా.. సంస్థాగతంగా ఈ టూల్స్‌ను వాడి అభివృద్ధికి తోడ్పడాలంటే సరైన నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు అవసరం. ఇక్కడే ప్రాంప్ట్‌ తెలిసిన నిపుణులు కంపెనీలకు అవసరమవుతున్నారు. దీంతో వీరికి డిమాండ్‌ పెరిగింది.


ఏంటిది..?

స్థూలంగా చెప్పాలంటే.. ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌ అనేది ఏఐ నుంచి అత్యంత కచ్చితమైన, అవసరమైన సమాచారం తెలుసుకునేందుకు అడగాల్సిన ప్రశ్నలు ఏంటో గుర్తించడం. దీనికి స్థిరమైన భాషాజ్ఞానం అవసరం. ఇదేమంత సులభమైన పని కాదు. ఏ లాంగ్వేజ్‌ ఇన్‌పుట్‌కు ఏఐ ఎలా ప్రతిస్పందిస్తుందో తెలుసుకునేందుకు ఈ ఇంజినీర్లు భాష లోతుల్లోకి వెళ్లి పరిశోధన చేస్తారు. వివిధ రకాలైన ప్రాంప్ట్‌కు ఎలా స్పందించాలనే విషయమై ఏఐకు శిక్షణ కూడా ఇస్తారు. ఈ ఉద్యోగాన్ని ప్రోగ్రామింగ్, ఇన్‌స్ట్రక్టింగ్, టీచింగ్‌ల సమ్మేళనంగా చెప్పవచ్చు. ఇందుకోసం వీరు నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పీ), నేచురల్‌ లాంగ్వేజ్‌ అండర్‌స్టాండింగ్‌ (ఎన్‌ఎల్‌యూ) అనే టెక్నాలజీలను వినియోగిస్తారు. ప్రాంప్ట్‌ ఇంజినీర్లు అనలిటిక్స్‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏఐ ప్లాట్‌ఫామ్స్‌ ప్రవర్తన, ప్రదర్శనను అంచనా వేసేందుకు ఇన్‌పుట్స్‌ - ఔట్‌పుట్స్‌ను గమనించాల్సి ఉంటుంది.  ఏఐ నుంచి సరైన సమాచారం కావాలంటే.. ఆ సమాచారాన్ని సూచించేలాంటి కచ్చితమైన ప్రశ్నలు అడగటం ముఖ్యం. ఎందుకంటే యూజర్‌కు ఏం కావాలో ఏఐకి తెలియదు. అడిగినదానికి మాత్రమే సమాధానం ఇస్తుంది. పెద్దస్థాయిలో ఉపయోగించినప్పుడు ఈ అంశం కొత్త కెరియర్‌ అవకాశాలను సృష్టిస్తోంది.


ఎందుకు?

ప్రత్యేకమైన అప్లికేషన్లకు లాంగ్వేజ్‌ మాడ్యూల్స్‌ను సిద్ధం చేయడంలో ప్రాంప్ట్‌ ఇంజినీర్లు ముఖ్యపాత్ర పోషిస్తారు. కచ్చితత్వాన్ని కొనసాగిస్తూ అధికశాతం అవసరమైన సమాధానాలు వచ్చేలా చేస్తారు. ఏఐ మాడ్యూల్స్‌ వినియోగదారులకు అద్భుతంగా సమాధానాలు ఇవ్వగలవు, కానీ వాటికి సరైన శిక్షణ లేకపోతే అవి అసంపూర్తిగా, సమగ్రత లేని జవాబులు ఇచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వీటికి శిక్షణ ఇచ్చే ప్రాంప్ట్‌ ఇంజినీర్లు అవసరం.


నైపుణ్యాలు..

ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌లో రాణించాలనుకునే అభ్యర్థులకు ప్రధానంగా కొన్ని నైపుణ్యాలు అవసరం. ఆంగ్లభాషపై పట్టు, బలమైన వెర్బల్‌ - రిటన్‌ స్కిల్స్‌ ఉండాలి. ప్రోగ్రామింగ్‌లో ప్రొఫిషియెన్సీ, ఏఐ టెక్నాలజీ పనితీరుపై అవగాహన, డేటా అనాలిసిస్‌లో అనుభవం, ఇతర ఉద్యోగాల మాదిరిగానే చక్కటి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 

వీటితోపాటు ప్రాంప్ట్‌ ఇంజినీర్లకు ప్రాబ్లమ్‌ సాల్వింగ్, అనలిటికల్‌ స్కిల్స్, క్రాస్‌ ఫంక్షనల్‌ టీమ్స్‌తో అనుసంధానమై పనిచేసే లక్షణాలు ఉండాలి.


బాధ్యతలు

ప్రాంప్ట్స్‌ రూపకల్పన - అభివృద్ధి: ఈ ఇంజినీర్లు ప్రాంప్ట్‌కు కాన్సెప్టు తయారుచేసి, డిజైన్‌ చేసి డెవలప్‌ చేస్తారు. ఇందులో భాగంగా వీరు కాంటెక్ట్స్‌ను అర్థం చేసుకోవడం, యూజర్‌ అవసరాలు తెలుసుకోవడం... చాట్‌ బోట్స్, వాయిస్‌ అసిస్టెంట్స్, రికమెండేషన్‌ సిస్టమ్స్‌ వంటి వాటికి యూజర్‌ ఫ్రెండ్లీ ప్రాంప్ట్స్‌ను తయారుచేయడం వంటి విధులు నిర్వర్తిస్తారు. 

టెస్టింగ్‌ - రిఫైన్‌మెంట్‌: తాము తయారుచేసిన ప్రాంప్ట్స్‌ను పరీక్షించడం, లోపాలను సవరించడం, ఇంకా మెరుగ్గా చేయడం చేస్తారు. 

బృందంగా..: ఏఐ ప్రాంప్ట్‌ ఇంజినీర్లు అధికశాతం డేటా సైంటిస్ట్‌లు, మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్లు, యూఎక్స్‌/యూఐ డిజైనర్లు వంటి వారితో కలిసి పని చేస్తారు. వీరు నిరంతరంగా తమ ప్రాంప్ట్‌ల పనితీరును గమనిస్తూ,  పాతవాటిని సమీక్షిస్తూ మెరుగుపరుస్తారు.


భవిష్యత్తు.. 

ఏఐ ఉపయోగం పెరిగేకొద్దీ ప్రాంప్ట్‌ ఇంజినీరింగ్‌ అవసరం పెరుగుతుంది. డైవర్సిఫికేషన్, స్పెషలైజేషన్, స్టాండర్డైజేషన్‌ అనే పద్ధతిలో ఐటీ మాదిరిగానే ఇదీ అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం చాట్‌జీపీటీ వంటి కమర్షియల్‌ ఏఐ ఇంకా అభివృద్ధి దశలో ఉందని చెప్పవచ్చు. త్వరలో ఇటువంటివి చాలా మోడల్స్‌ రానున్నాయి, అందులో కొన్ని మార్కెట్‌ను ఆక్రమించుకుంటాయని నిపుణుల అంచనా. అందుకే ఏఐ ఆధారిత ఉద్యోగాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ ప్రాంప్ట్‌ ఇంజినీర్లకు సమీప భవిష్యత్తులో మరింతగా అవకాశాలు పెరుగుతాయని చెప్పవచ్చు.


అవ్వడం ఎలా?

కంప్యూటర్‌ సైన్స్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్, డేటా సైన్స్, అనుబంధ సబ్జెక్టుల్ల్లో కనీసం డిగ్రీ ఉండాలి. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లపై గట్టి పట్టు సంపాదించాలి. ఏఐ, ఎన్‌ఎల్‌పీ అప్లికేషన్లకు విరివిగా ఉపయోగిస్తూ ఉండటం వల్ల పైతాన్‌ లాంగ్వేజ్‌ను కచ్చితంగా నేర్చుకోవాలి. జావా, ఆర్, జావాస్క్రిప్ట్‌లపై అవగాహన అవసరం. ఏఐ, ఎన్‌ఎల్‌పీ, ఎన్‌ఎల్‌యూ, అనుబంధ సబ్జెక్టుల్లో స్పెషలైజ్డ్‌ మాస్టర్స్‌ డిగ్రీ ఆన్‌లైన్‌లో చేయవచ్చు. వీటితోపాటు న్యూరల్‌ నెట్‌వర్క్స్, డీప్‌ లెర్నింగ్, ఇతర ఏఐ టెక్నాలజీలతో పరిచయం అవసరం. మెషీన్‌ లెర్నింగ్‌ అల్గారిథమ్స్, డేటా ప్రాసెసింగ్, ఎవాల్యుయేషన్‌ టెక్నిక్స్‌ నేర్చుకోవాలి. 

సర్టిఫికేషన్స్‌ - కోర్సులు: దీనికి ప్రత్యేకమైన డిగ్రీలు అంటూ ఏమీ లేకపోయినా తాజా టెక్నాలజీలపై గట్టి పట్టు సాధిస్తే ఈ రంగంలోకి ప్రవేశించే అవకాశాలుంటాయి. సైన్స్, ఇంజినీరింగ్, ఇతర అనుబంధ కోర్సులు చదివినవారు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌లో లభించే ప్రాంప్ట్‌ కోర్సులు చేయడం ద్వారా అవకాశాలు అందుకోవచ్చు.
 

 

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.