2, ఆగస్టు 2023, బుధవారం

UGC: ఆ యూనివర్సిటీలు ఫేక్‌.. అవి ఇచ్చే డిగ్రీలు చెల్లవు!





దిల్లీ: దేశంలో 20 యూనివర్సిటీలను నకిలీవిగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(UGC) బుధవారం(ఆగస్టు 2) ప్రకటించింది. అలాంటి యూనివర్సిటీలు దిల్లీలో అత్యధికంగా ఎనిమిది ఉండగా.. యూపీలో నాలుగు, ఏపీ, బెంగాల్‌లో రెండేసి, మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపింది. ఈ వర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా పలు సంస్థలు డిగ్రీలు ప్రదానం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు యూజీసీ తెలిపింది. అలాంటి విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలను ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించబోమని.. ఆ డిగ్రీలు చెల్లుబాటు కావని యూజీసీ తేల్చి చెప్పింది. ఈ యూనివర్సిటీలకు అసలు డిగ్రీలు ఇచ్చే అధికారమే లేదని యూజీసీ కార్యదర్శి మనీష్‌ జోషీ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏపీలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ;  బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియా వర్సిటీలు నకిలీవిగా ప్రకటించింది. 


యూజీసీ ప్రకటించిన 20 ఫేక్‌ యూనివర్సిటీల జాబితా ఇదే.. 

దిల్లీలో ఎనిమిది ఫేక్‌ యూనివర్సిటీల జాబితాలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్ అండ్‌ఫిజికల్‌ హెల్త్‌ సైన్సెస్‌; కమర్షియల్‌ యూనివర్సిటీ లిమిటెడ్‌- దర్యాగంజ్‌; యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ, వొకేషనల్‌ యూనివర్సిటీ; ఏడీఆర్‌ సెంట్రిక్‌ జ్యూరిడికల్‌ యూనివర్సిటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌; విశ్వకర్మ ఓపెన్‌ యూనివర్సిటీ ఫర్‌ సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌; ఆధ్యాత్మిక్‌ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం) ఉన్నట్టు పేర్కొంది.  అలాగే, యూపీలో నాలుగు యూనివర్సిటీల జాబితాలో  గాంధీ హిందీ విద్యాపీఠ్‌, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎలక్ట్రో కాంప్లెక్స్‌ హోమియోపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ యూనివర్సిటీ (ఓపెన్‌ యూనివర్సిటీ); భారతీయ శిక్షా పరిషత్‌ ఉన్నట్టు తెలిపింది. 

ఏపీలోని గుంటూరులోని కాకుమానివారితోటలోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ;  విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియాలను నకిలీవిగా గుర్తించిన యూజీసీ.. పశ్చిమబెంగాల్‌లో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌; ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆల్టర్నేటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చి సంస్థలను నకిలీ వర్సిటీలుగా ప్రకటించింది. అలాగే,  కర్ణాటకలోని బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ; కేరళలో సెయింట్‌ జాన్స్‌ యూనివర్సిటీ, మహారాష్ట్రలో రాజా అరబిక్‌ యూనివర్సిటీ, పుదుచ్చేరిలో శ్రీ బోధి అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వర్సిటీలు నకిలీవని తెలిపింది.

 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: