13, సెప్టెంబర్ 2023, బుధవారం

రూ.లక్ష జీతంతో నాబార్డులో ఉద్యోగాలు ‣ 150 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఖాళీలకు నోటిఫికేషన్‌ కేంద్రానికి చెందిన జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) ఏ ఆఫీసర్‌ (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టులకు ప్రకటన విడుదలైంది. వీటికి డిగ్రీ విద్యార్హతతో పోటీపడొచ్చు. ఎంపిక మూడంచెల్లో ఉంటుంది. విజయవంతమైనవారు మొదటి నెల నుంచే దాదాపు రూ.లక్ష వేతనం అందుకోవచ్చు.

రూ.లక్ష జీతంతో నాబార్డులో ఉద్యోగాలు

150 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఖాళీలకు నోటిఫికేషన్‌


కేంద్రానికి చెందిన జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్‌ (నాబార్డ్‌) ఏ ఆఫీసర్‌ (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టులకు ప్రకటన విడుదలైంది. వీటికి డిగ్రీ విద్యార్హతతో పోటీపడొచ్చు. ఎంపిక మూడంచెల్లో ఉంటుంది. విజయవంతమైనవారు మొదటి నెల నుంచే దాదాపు రూ.లక్ష వేతనం అందుకోవచ్చు. 


వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా నాబార్డ్ కృషి చేస్తోంది. సమర్థులైన మేనేజర్లతోపాటు, సబ్జెక్టు అవసరం. జనరల్‌కు 77 పోస్టులకు సాధారణ డిగ్రీతోనే పోటీ పడవచ్చు. రూరల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు చదువుకున్నవారు ఈ పరీక్షలో రాణించడానికి అవకాశం ఉంది. ఆంగ్లంలోనూ ప్రావీణ్యం అవసరం. పరీక్షకు సంబంధించి సిలబస్‌ వివరాలు నోటిఫికేషన్‌లో తెలియజేశారు. వాటిని గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో శ్రద్ధగా చదివితే రాణించగలరు. ఈ ఉద్యోగంలో చేరినవారు అధిక వేతనంతోపాటు వృత్తిపరమైన సంతృప్తినీ పొందవచ్చు. వీరికి రూ.44,500 మూల వేతనం చెల్లిస్తారు. అన్ని అలవెన్సులతో నెలకు రూ.లక్ష జీతం పొందవచ్చు. దీనితో పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయి. పట్టణాలు, నగరాల్లోనే విధులు నిర్వర్తించవచ్చు.   


ఎంపిక..

ఫేజ్‌-1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్‌-2 మెయిన్‌ పరీక్షలు, ఫేజ్‌-3 మౌఖిక పరీక్షతో నియామకాలుంటాయి. 


ఫేజ్-1 ప్రిలిమినరీ:ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నలే వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఏ పోస్టుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థులందరికీ ప్రిలిమినరీ ఉమ్మడిగా చేరింది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలడుగుతారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కి 20, రీజనింగ్‌ 20, ఇంగ్లిష్‌ లాంగ్‌వేజ్‌ 30, నాలెడ్జ్‌ 20, డెసిషన్‌ కంప్యూటర్‌ మేకింగ్‌ 10, జనరల్‌ అవేర్‌నెస్‌ 20, భారతదేశ గ్రామీణ ప్రాంతాలు.. ఆర్థిక, సాంఘిక రంగాల్లో 40, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో 4. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. సెక్షన్లవారీ కటాఫ్‌ ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్‌వేజ్, కంప్యూటర్‌ నాలెడ్జ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, డెసిషన్‌ మేకింగ్‌ విభాగాల్లో అర్హత సాధిస్తే సరిపోతుంది. జనరల్‌ అవేర్‌నెస్, ఆర్థిక సాంఘిక అంశాలు, వ్యవసాయం, అభివృద్ధి విభాగంలో అర్హత మార్కులు పొందిన అభ్యర్థుల జాబితా నుంచి మెరిట్‌ ప్రకారం ఫేజ్‌-2కి అవకాశమిస్తారు. ఫేజ్-1లో సాధించిన మార్కులను తుది ఎంపికలో ఎంపిక తీసుకోరు. ఒక్కో పోస్టుకు 25 మందికి చొప్పున ఫేజ్‌-2కు ఎంపిక చేస్తారు. 


ఫేజ్-2 మెయిన్: ఈ పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండు విధాల్లోనూ ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 జనరల్‌ ఇంగ్లీష్‌ నుంచి డిస్క్రిప్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌లోనే కీబోర్డు ఉపయోగించి సమాధానాలు రాయాలి. మొత్తం మార్కులు వంద. పరీక్ష వ్యవధి ఒకటిన్నర గంటలు. అభ్యర్థికి ఆంగ్లంలో రాత విశ్లేషణ, నైపుణ్యాలు ఏమేరకు ఉన్నాయో గుర్తించారు. దీనికోసం ఎస్సే, కాంప్రహెన్షన్, రిపోర్ట్, పారాగ్రాఫ్, లెటర్‌ రైటింగ్‌ల్లో ప్రశ్నలడుగుతారు. పేపర్‌-1 జనరల్‌ ఇంగ్లీష్‌ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా ఉంటుంది. 


పేపర్‌-2 ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్‌ రెండు విధాలుగానూ ఉంటుంది. జనరల్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గ్రామీణ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఆర్థిక, సాంఘిక అంశాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో ప్రశ్నలు వస్తాయి. పరీక్షకు వంద మార్కులు. ఇందులో 30 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి 50 మార్కులు. కొన్ని మార్కు, రెండు మార్కుల ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 30 నిమిషాలు. డిస్క్రిప్టివ్‌లో 6 ప్రశ్నలు వస్తాయి. వీటికి 50 మార్కులు. వ్యవధి 90 నిమిషాలు. నాలుగు ప్రశ్నలకు రాస్తే సరిపోతుంది. కీబోర్డు ఉపయోగించి, ఇంగ్లీష్ లేదా హిందీలో రాయాలి. రెండు ప్రశ్నలకు ఒక్కో దానికి 15 చొప్పున 30 మార్కులు. మరో రెండు ప్రశ్నలకు ఒక్కో దానికి 10 చొప్పున 20 మార్కులు కేటాయించారు. స్పెషలిస్ట్‌ (ఇతర) పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధిత పేపర్‌-2 ప్రశ్నపత్రం ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానికీ పావు శాతం మార్కులు తగ్గుతాయి. మెయిన్స్‌ పరీక్ష అనంతరం సైకోమెట్రిక్‌ నిర్వహించారు. 


ఫేజ్‌-3 మౌఖిక పరీక్ష: ఫేజ్‌-2లో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం ఒక్కో పోస్టుకు ముగ్గురిని చొప్పున ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. దీనికి 50 మార్కులు. ఫేజ్‌-2లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ మార్కులను కలిపి తుది నియామకాలు చేపడతారు. 


ముఖ్య సమాచారం..

పోస్టు: అసిస్టెంట్ మేనేజర్‌-ఏ (రూరల్‌వలప్‌మెంట్‌ బ్యాంకింగ్ సర్వీస్)


ఖాళీలు: 150. కమ్యూనికేషన్ విభాగాల వారీ.. జనరల్‌ 77, కంప్యూటర్‌ ఇన్‌మేషన్‌ టెక్నాలజీ 40, ఫైనాన్స్‌ 15, కంపెనీ సెక్రటరీ 3, సివిల్‌ ఇంజినీరింగ్‌ 3, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ 3, జియో ఇన్‌ఫర్మాటిక్స్‌ 2, ఫారెస్ట్రీ 2, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ 2, 2 ప్రాసెసింగ్‌ 


అర్హత: జనరల్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం సరిపోతాయి. లేదా ఎంబీఏ/ పీజీఎంలో 55 శాతం మార్కులు పొందినవారూ అర్హులే. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 50 శాతం చాలు. మిగిలిన పోస్టులకు సంబంధించిన డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం అవసరం. 


వయసు: సెప్టెంబరు 1, 2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. సెప్టెంబరు 2, 1993 - సెప్టెంబరు 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబరు 23


ఆన్‌లైన్ ప్రిలిమినరీ (ఫేజ్-1):   అక్టోబరు 16


పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 150. మిగిలిన విభాగాల వారికి రూ.800.


వెబ్‌సైట్: https://www.nabard.org/

 

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: